ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

టిఆర్ఎస్ ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఎం‌.

 Grand Konda Laxman Bapuji Jayanti Celebrations , Konda Laxman Bapuji , Konda La-TeluguStop.com

ఎల్‌.సి, టి‌ఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ మరియు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పూలమాలలతో నివాళులర్పించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దేశమంతటా ప్రజలు ఆనందోత్సవాలలో పాల్గొంటున్ననూ, తెలంగాణ ప్రజలు నిజాం నిత్య అకృత్యాలకు లోనై ఉండటాన్ని చూసి విమోచనోద్యమంలో పోరాడిన మహనీయులు కొండ లక్ష్మణ్ బాపూజీ అని ఎం‌.ఎల్‌.సి, టి‌ఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెరాస యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనపు కృష్ణ చైతన్య, కొణిజెర్ల మండల నాయకులు పోట్ల శ్రీను, బ్రహ్మం, చేరుకుమల్లి రవి, ఉద్యమకారులు పగడాల నరేందర్, ఎండి ఆసిఫ్ అహ్మద్, సయ్యద్ బురాన్, మంచి కంటి నరేష్, టిఆర్ఎస్ కెవి అధ్యక్షులు పాష, పోలేపల్లి గ్రామ నాయకులు మద్దెల విజయ్ కుమార్, భాస్కర్, శ్రీనివాస్, అశ్విని కుమార్ మరియు సత్తుపల్లి శాశనసభ నాయకులు పాల్గొని ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube