సినిమా గురించి ఎంత మాట్లాడినా పెళ్లి గురించి ఫోకస్ చేస్తున్నారు: వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) త్వరలోనే గాండీవ దారి అర్జున ( Gandheevadari Arjuna )సినిమా ద్వారా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 No Matter How Much You Talk About The Film You Are Focusing On The Wedding Varun-TeluguStop.com

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వరుణ్ తేజ్ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ తాను ఎప్పుడు రొటీన్ కథలను చేయను ఎప్పుడు విభిన్న సినిమాలనే ఎంపిక చేసుకుంటాను.

గని సినిమా సమయంలోనే ప్రవీణ్ సత్తారు ( Praveen Sattharu ) ఈ కథ చెప్పారని వెల్లడించారు.

Telugu Guard, Lavanya Tripati, Tollywood, Varun Tej-Movie

ఈ కథ చెప్పే సమయంలోనే తాను ఇంప్రెస్ అయ్యానని అందుకే ఈ సినిమాకు కమిట్ అయ్యానని తెలిపారు.ఇందులో తాను ఒక బాడీగార్డ్ ( Body Guard )పాత్రలో కనిపిస్తానని వరుణ్ తేజ్ వెల్లడించారు.ఇక ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ అందరిని ఆకట్టుకుంటాయని తెలిపారు.

ఇక యాంకర్ వరుణ్ తేజ్ ను ప్రశ్నిస్తూ ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దానికన్నా భారీగా పెరిగిపోయిందని వార్తలు వస్తున్నాయి ఇందులో నిజం ఎంత అని ప్రశ్నించారు.

Telugu Guard, Lavanya Tripati, Tollywood, Varun Tej-Movie

ఈ ప్రశ్నకు వరుణ్ సమాధానం చెబుతూ ఈ సినిమా ఫారిన్ లో షూటింగ్ చేసే సమయంలో బాగా వర్షాలు పడ్డాయి రోడ్లన్నీ పాడైపోయాయి దీంతో షూటింగ్ చేయడానికి కాస్త ఆలస్యమైంది.అందుకే ఎక్కువ రోజులు ఫారెన్ లోనే స్టే చేయాల్సి రావడంతో ఖర్చులు కూడా పెరిగిపోయాయని తెలిపారు.ఇక మీ ప్రేమ గురించి చెప్పండి అనడంతో తాను లావణ్య త్రిపాటి ( Lavanya Tripati ) గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నామని తెలిపారు.

మిస్టర్ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని వరుణ్ తెలిపారు.ఇక నేను సినిమా గురించి అరగంట మాట్లాడాను నా ప్రేమ గురించి పది నిమిషాలు మాట్లాడిన నా ప్రేమ విషయాలని హైలెట్ చేస్తూ వాటిని హెడ్డింగ్స్ గా పెడుతూ వార్తలు రాస్తున్నారు అంటూ ఈ సందర్భంగా వారుణ్ తేజ్ తన ప్రేమ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube