ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులపై ఆశలు లేవు

నల్లగొండ జిల్లా:ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న వాళ్లు బ్రతకడం చాలా కష్టమని, వారిపై ఆశలు వదులుకోవడమేనని రెస్క్యూ టీమ్ బృందం చెబుతుంది.

లోపల కూలిన మట్టి,రాళ్లను తీయాలంటే సంవత్సరం పైనే పడుతుందని,టన్నెల్ లోపల ప్రమాదం పొంచి ఉందని, లోపలికి వెళ్లే కొద్దీ ప్రమాదం మరింత ఎక్కువ అవుతుందన్నారు.

టన్నెల్ లోపల మట్టి మళ్ళీ కూలే ప్రమాదం ఉందని అంటున్నారు.డెహ్రాడూన్‌లో 41 మందిని కాపాడినం కానీ, ఇక్కడ ఆశలు లేవు కాబట్టి మేము తిరిగి వెళ్ళిపోతున్నామని ప్రత్యేక రెస్క్యూ సిబ్బంది చెప్పడంతో ప్రభుత్వం ఆలోచనలో పడ్డది.

No Hope For The Workers Trapped In The SLBC Tunnel, No Hope , Workers Trapped ,
నల్లగొండ జిల్లాలో నయా యాప్ మోసం వెలుగులోకి...!

Latest Nalgonda News