డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఈరోజు థియేటర్లో విడుదలైన సినిమా కార్తికేయ 2. ఇక ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ నటీనటులుగా నటించారు.
అంతేకాకుండా అనుపమ్ కేర్, శ్రీనివాస్ రెడ్డి, హర్ష చెముడు, ఆదిత్య మీనన్, ప్రవీణ్, సత్య, తులసి తదితరులు నటించారు.ఇక ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్, విశ్వప్రసాద్ నిర్మాతలుగా బాధ్యత వహించారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఇదివరకే ఈ సినిమా కార్తికేయగా విడుదల కాగా ఇప్పుడు సీక్వెల్ తో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో.నిఖిల్ కు ఎటువంటి సక్సెస్ ను అందించిందో చూద్దాం.
కథ:
ఈ సినిమా చాలా ఊహ జనితమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.శ్రీకృష్ణ భగవానుడు కాలి కంకణం చుట్టూ ఈ కథ అనేది నడుస్తుంది.
ఇందులో నిఖిల్ డాక్టర్ గా కనిపిస్తాడు.అయితే ఆయన ఇంట్రెస్టింగ్ విషయాలపై బాగా ఆసక్తి చూపిస్తాడు.
ఇక ద్వారకలో జరుగుతున్న పరిస్థితుల వెనుక ఉన్న రహస్యాలని వెతకడానికి ప్రయత్నిస్తాడు.ఇక కొన్ని పురాతన నమ్మకాలకు, ద్వారకలోని కృష్ణుని శక్తికి సంబంధించిన ఎన్నో విషయాలు బయటకి వస్తుంది.
ఇక కార్తికేయ తో పాటు ఇది ఇంకెవరికి కావాలి అనేది.దానికోసం కార్తికేయ ఎలా ప్రయాణం సాగించాడు అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
ఇందులో నిఖిల్ తన పాత్రతో మునిగిపోయాడు.మరోసారి తన పాత్రతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.అనుపమ పరమేశ్వరన్ కూడా పాత్రతో మంచి మార్క్ క్రియేట్ చేసుకుంది.శ్రీనివాస్ రెడ్డి తన కామెడీ టైమింగ్ తో తెగ నవ్వించాడు.మిగతా నటీనటునంత తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
డైరెక్టర్ చందు ఈ సినిమాను బోర్ కొట్టకుండా మంచి ఫీలింగ్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.ఇక కాలభైరవ అందించిన సంగీతం బాగానే ఆకట్టుకుంది.
విశ్లేషణ:
ఈ సినిమాను కొత్త కథను ఆకట్టుకునే కథనంతో దర్శకుడు చూపించాడు.నిఖిల్ పాత్ర ఆయన సాహసాలు బాగా చూపించారు.
ప్లస్ పాయింట్స్:
నిఖిల్ నటన, సినిమా కథ, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.సంగీతం బాగా ఆకట్టుకుంది.ప్రొడక్షన్ డిజైన్.
మైనస్ పాయింట్స్:
కాస్త ట్విస్ట్ ఉంటే బాగుండేది.థ్రిల్లింగ్ లో కూడా శ్రద్ధ పెడితే బాగుండేది.
అక్కడక్కడ కాస్త స్లోగా అనిపించింది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కాస్త శ్రద్ధ పెడితే బాగుండేది.
బాటమ్ లైన్:
సినిమా ప్రారంభం నుండి క్లైమాక్స్ వరకు మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది.ఈ సినిమాల్లోని బ్యాక్గ్రౌండ్ మాత్రం ప్రేక్షకుడిని కనెక్ట్ చేసే విధంగా ఉన్నాయి.అంతేకాకుండా నిఖిల్ నటన మాత్రం బాగా పర్ఫెక్ట్ గా ఉంది.కాబట్టి ఈ సినిమాను చూడవచ్చు.