కొత్త సంవత్సరంలో అమల్లోకి కొత్త రూల్స్..!!

కొత్త సంవత్సరంలో కొత్త నియమ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.ఆర్థికపరంగా పలు మార్పులు చోటు చేసుకున్నాయి.

 New Rules Come Into Effect In The New Year..!!-TeluguStop.com

యూపీఐ ఖాతాలు డీయాక్టివేట్.ఏడాదికిపైగా వినియోగంలో లేని యూపీఐ ఖాతాలు ఇవాళ్టి నుంచి డీయాక్టివేట్ అవుతాయి.

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐలలో నిరుపయోగంగా ఉన్న ఖాతాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తొలగించనుంది.

పెరగనున్న కార్ల ధరలు… కార్ల ధరలు పెరగనున్నాయి.

ఈ మేరకు టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, మెర్సిడెస్ బెంజ్ మరియు ఆడి కంపెనీలు రేట్లను పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో వాహనాల ధరలు రెండు నుంచి మూడు శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

కొత్త సిమ్ కార్డుకు రూల్స్.కొత్త సిమ్ కార్డులు తీసుకునే వారు డిజిటల్ వెరిఫికేషన్ విధానాన్ని అమలు కావాల్సి ఉంటుంది.

ఈ మేరకు టెలికాం కంపెనీలు మొబైల్ ద్వారానే వెరిఫికేషన్ చేస్తాయి.దీంతో ఇప్పటివరకు అమల్లో ఉన్న పేపర్ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్ విధానానికి స్వస్తి పలికింది.

పొదుపు పథకాల వడ్డీ పెంపు.పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్రం పెంచింది.

ఈ క్రమంలో జనవరి – మార్చి త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేటు పెరిగింది.ప్రస్తుతం ఎనిమిది శాతం వడ్డీ చెల్లిస్తున్న సుకన్య సమృద్ధి పథకానికి 20 బేసిస్ పాయింట్లను పెంచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube