కొత్త సంవత్సరంలో అమల్లోకి కొత్త రూల్స్..!!
TeluguStop.com
కొత్త సంవత్సరంలో కొత్త నియమ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.ఆర్థికపరంగా పలు మార్పులు చోటు చేసుకున్నాయి.
యూపీఐ ఖాతాలు డీయాక్టివేట్.ఏడాదికిపైగా వినియోగంలో లేని యూపీఐ ఖాతాలు ఇవాళ్టి నుంచి డీయాక్టివేట్ అవుతాయి.
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐలలో నిరుపయోగంగా ఉన్న ఖాతాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తొలగించనుంది.
పెరగనున్న కార్ల ధరలు.కార్ల ధరలు పెరగనున్నాయి.
ఈ మేరకు టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, మెర్సిడెస్ బెంజ్ మరియు ఆడి కంపెనీలు రేట్లను పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వాహనాల ధరలు రెండు నుంచి మూడు శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
కొత్త సిమ్ కార్డుకు రూల్స్.కొత్త సిమ్ కార్డులు తీసుకునే వారు డిజిటల్ వెరిఫికేషన్ విధానాన్ని అమలు కావాల్సి ఉంటుంది.
ఈ మేరకు టెలికాం కంపెనీలు మొబైల్ ద్వారానే వెరిఫికేషన్ చేస్తాయి.దీంతో ఇప్పటివరకు అమల్లో ఉన్న పేపర్ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్ విధానానికి స్వస్తి పలికింది.
పొదుపు పథకాల వడ్డీ పెంపు.పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్రం పెంచింది.
ఈ క్రమంలో జనవరి - మార్చి త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేటు పెరిగింది.
ప్రస్తుతం ఎనిమిది శాతం వడ్డీ చెల్లిస్తున్న సుకన్య సమృద్ధి పథకానికి 20 బేసిస్ పాయింట్లను పెంచింది.
పుష్ప ది రూల్ ట్రైలర్ రిలీజ్ అప్పుడేనా.. ఆ సీన్ హిట్టైతే పుష్ప2 ఇండస్ట్రీ హిట్!