నాని( Nani )… అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ ను మొదలుపెట్టి హీరోగా మారి ప్రస్తుతం నాచురల్ స్టార్ గా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదిచుకున్నాడు.సినిమా సినిమాకు తనను తాను మలుచుకుంటూ ప్రస్తుతం పర్ఫార్మర్ గా తెలుగు హీరోల్లో టాప్ లో ఉన్నాడు.
భిన్నమైన చిత్ర కథలను చాలా మంది హీరోల కంటే ఎంతో భిన్నంగా ఎంచుకుంటున్నాడు.అందుకే నాని ప్రస్తుతం తెలుగులోనే నెంబర్ వన్ హీరోగా దూసుకెళుతున్నాడు.2008 లో అష్ట చెమ్మ సినిమాతో హీరో గా తెరంగేట్రం చేశాడు నాని.కెరీర్ మొత్తం మీద ఇప్పటికే 29 సినిమాలు చేసిన నాని తన 30 వ సినిమా చేయడానికి రంగం సిద్దం అవుతుంది.
ఇక నాని పాన్ ఇండియా హీరో గా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఎదుగుతున్న తీరు ఎంతో అద్బుతం అనే చెప్పాలి.అతడి చివరి మూడు సినిమాలను బట్టి చూస్తే నాని ఒక గొప్ప నటుడు అని, అతడి కథల ఎంపిక ఎంత వైవిధ్యంగా ఉందో అర్దం చేసుకోవచ్చు.నాని చివరి సినిమా దసరా.మొదట కొంత డివైడ్ టాకుతో మొదలైన ఈ సినిమా 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టింది.ఇక ఈ సినిమాలో నాని నటన మరో లెవెల్ లో ఉంది.
మాస్ ఎలిమెంట్స్ తో కూడిన హీరో నాని యాక్షన్ చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవనే చెప్పాలి.ఈ సినిమాలో నానితో పాటు కీర్తి సురేష్ ( Keerthy Suresh )కూడా ఎంతో చక్కగా నటించింది.ఇక నాని నటించిన మొట్టమొదటి ప్యాన్ ఇండియా చిత్రంగా కూడా దసరా చిత్రం పేరు చెప్పుకోవచ్చు.
దసరా చిత్రానికంటే ముందు నాని నటించిన మరొక సినిమా శ్యామ్ సింగరాయ్.ఈ సినిమాలో బెంగాలీ రైటర్గా నటించిన నాని సాయి పల్లవి తో కలిపి ఒక అద్భుతమైన చిత్రం తీసాడనే చెప్పుకోవచ్చు.ఈ సినిమా కథ ఇప్పటివరకు టాలీవుడ్ లో ఏ సినిమాలోనూ కనిపించలేదు.మరొక చిత్రం అంటే సుందరానికి.ఈ చిత్రంలో కలిపి నాని నటన చాలా బాగుంటుంది ఒక భిన్నమైన సబ్జెక్టుగా వచ్చి డీసెంట్ హిట్ కొట్టింది.నాని నటించిన ఈ చివరి మూడు సినిమా కథలకు ఒకదానికొకటి సంబంధం ఉండదు.
ఇలా భిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలోనే మంచి హీరోగా పర్ఫార్మర్ గా ఎదుగుతున్నాడు నాని.