చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న దసరా( Dasara ) చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.నాని హీరోగా కీర్తి సురేష్( Keerthy Suresh ) హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో రూపొందిన దసరా చిత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.
కొన్ని విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటున్న కూడా ఓవరాల్ గా మాత్రం సినిమా కు పాజిటివ్ టాక్ దక్కిందని చెప్పాలి.
నాని( Nani ) కెరియర్ లోనే విభిన్నమైన సినిమా అంటూ చిత్ర యూనిట్ సభ్యులు విభిన్నంగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు.అంతే కాకుండా సినిమా మాస్ ఆడియన్స్( Mass Audience ) ని మాత్రమే కాకుండా క్లాస్ ఆడియన్స్( Class Audience ) ని కూడా సర్ప్రైజ్ చేస్తుందనే నమ్మకాన్ని యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తూ వచ్చారు.అన్నట్లుగానే క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరినీ ఈ సినిమా ఆకట్టుకుంటుంది.
రివ్యూ లు కూడా పాజిటివ్ గా వచ్చాయి.దాంతో ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత వసూళ్లు చేస్తుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
పాన్ ఇండియా స్థాయి( Pan India )లో ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది.తెలుగు లో వచ్చినంత పాజిటివ్ రెస్పాన్స్ ఇతర భాషల్లో కనిపించడం లేదు.ముందు ముందు ఇతర భాషల్లో ఈ సినిమా కలెక్షన్స్ పుంజుకుంటే కచ్చితంగా భారీ నెంబర్ నమోదు అయ్యే అవకాశం ఉంది.కానీ తెలుగులో మాత్రమే ఈ సినిమా ఆడితే మాత్రం రూ.100 కోట్ల లోపు కలెక్షన్స్( 100 Crore Collections ) నమోదయ్యే అవకాశం ఉంది.ఇతర భాషలో ఆడితే మరో 30 నుండి 40 కోట్ల కలెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా 150 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేస్తుందనే నమ్మకాన్ని చిత్ర ప్రమోషన్ సమయం లో మీడియా వారితో యూనిట్ సభ్యులు చెప్తూ వచ్చాను.ఇప్పుడు అదే నిజమయ్యే విధంగా కాస్త అటు ఇటుగా కలెక్షన్స్ నమోదు అవుతున్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.