వివాహితపై అత్యాచారయత్నం

నల్లగొండ జిల్లా: వ్యవసాయ పనులు ముగించుకొని కాలినడకన ఇంటికి వస్తున్న వివాహితను అదే గ్రామానికి చెందిన రవి ఇంటిదగ్గర దింపుతానని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని కొంచెం దూరం రాగానే ఎవరూ లేని ప్రదేశంలో ద్విచక్ర వాహనాన్ని( Two-wheeler ) ఆపి ఆమెపై లైంగిక దాడికి యత్నించిన ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం( Vemulapally ) లక్ష్మీదేవిగూడెం లో మంగళవారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆమె అతనిని ప్రతిఘటించి అక్కడి నుండి తప్పించుకొని ఇంటికొచ్చి జరిగిన విషయాన్ని భర్తకు, కుటుంబ సభ్యులకు తెలిపింది.

దీనితో కుటుంబ సభ్యులు పోలీసులను( Police ) ఆశ్రయించే ప్రయత్నంలో ఉండగా కొంతమంది రాజకీయ నాయకులు గుట్టు చప్పుడు కాకుండా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసినా వారి ప్రయత్నాలుఫలించకపోవడంతో ఈ విషయం కాస్త పోలీస్ స్టేషన్ దాకా వెళ్లినట్లు సమాచారం.ఇదే విషయంపై వేములపల్లి ఎస్ఐ విజయ్ కుమార్ ను వివరణ కోరగా ఫిర్యాదు వచ్చిందని,కేసు కూడా నమోదు చేశామని చెప్పారు.

పాలకులు మారినా,ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మహిళలపై జరిగే అమానుషపు ఘటనలను అదుపు చేయలేకపోవడం బాధాకరం.

Advertisement

Latest Nalgonda News