బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది.తాజాగా జరిగిన షో లో షణ్ముఖ్, సిరి ప్రవర్తన చూసి ప్రేక్షకులు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది.
అనీ మాస్టర్ సైకోలా బిహేవ్ చేస్తూ మరొకసారి తన నోటిదురుసు చూపించింది.ప్రియాంక సన్నీ దగ్గర కూర్చుని మానస్ గురించి తెగ బాధపడి పోయింది.
మానస్ గేమ్ నేను ఆడుతూ ఉన్నానని ఎలా అంటారు అన్నయ్య అని అనగా అతి ప్రేమ కూడా ప్రమాదమే అని అన్నాడు సన్నీ. నేను మానస్ పట్ల అతి ప్రేమ ఏం చూపించా అన్నయ్యా అంటూ జోకేసింది ప్రియాంక.
ఇక మానస్ గురించి మాట్లాడుతుండగా ఇంతలో మానస్ వచ్చి ఇంటి లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకలా ఉంటారు.నువ్వు అందర్నీ మేనేజ్ చేస్తున్నావు అని అనుకుంటున్నారు.
ఇక్కడ నుంచి గేమ్ అలాగే ఉంటుంది నువ్వు లాస్ట్ వీక్ ఎలిమినేషన్ తప్పించుకున్నావ్, ప్రతి వీక్ కూడా ఇలాగే ఉంటుంది నువ్వు రెడీ అయిపో నేను చెప్పిన గుర్తు పెట్టుకో అని తెలిపాడు మానస్.
హౌస్‌లో తక్కువ మంది ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.17 కెమెరాలు 19 మంది ఉన్నప్పుడు వేరు.17 కెమెరాలు 9 మంది ఉన్నప్పుడు వేరు.అంటూ షణ్ముఖ్ సిరికి హితబోధ చేశాడు.నీ క్యారెక్టర్ గురించి మిగిలిన వాళ్లు ఈ అమ్మాయి ఇలాంటిది అని ఎందుకు అనుకోవడం లేదంటే.నువ్ టాస్క్‌లు బాగా ఆడుతున్నావ్.మన ఫ్రెండ్ షిప్ బాగా ఉంది.
ఒకరి పట్ల ఒకరు స్టాండ్ తీసుకునే విధానం.పరిస్థితుల్ని డీల్ చేసే విధానం అంతా బాగుంది.
ఈ టైంలో మనపై చిన్న మచ్చ కూడా పడకూడదు.అది వేరే వాళ్లకి ప్లస్ కాకూడదు.చిన్న మిస్టేక్‌తో టాప్ 5 మిస్ కావొచ్చు.అదే చిన్న పాయింట్ విన్నింగ్ ఛాన్స్ మిస్ కావొచ్చు.అప్పుడు అనిపిస్తుంది.ఆ చిన్న మిస్టేక్ చేయకుండా ఉండాల్సిందని బాధపడతావ్.
అని తెలిపారు షణ్ముఖ్.
షణ్ముఖ్‌కి దిష్ఠి ఎక్కువ తగులుతుందని, అతనికి దిష్టి పూసలు రవితో కట్టించింది.
సిరి షణ్ముఖ్ మోజ్ రూమ్ లోకి వెళ్లి సన్నీ మాట్లాడుతుండగా,వచ్చి దిష్ఠి పూసలు బ్యాండ్ తొడిగింది.ఇదేంటి అని షణ్ముఖ్ అడగ్గా.బ్లడ్ అని చెప్పింది.బ్లడ్ ఏంటి అని షణ్ముఖ్‌తో పాటు చూసి ఆడియన్స్ కూడా ఆశ్చర్యపోయారు.
అవును నా బ్లడ్‌ని పూసలకి రాసి బ్యాండ్ చేశా.దాని వల్ల నీకు దిష్ఠి తాకదు అని చెప్పింది.కరెక్ట్‌గా ఎనిమిది పూసలు పెట్టింది.నేను కాకుండా ఎనిమిది మంది ఉన్నారుగా.ఆ ఎనిమిది మంది దిష్ఠి నీకు తగలకుండా ఎనిమిది పూసలు పెట్టింది అని ఎదురుగా ఉన్న సన్నీతో చెప్పి నవ్వుకున్నాడు షణ్ముఖ్.ఆ తరువాత బ్లడ్తో ఎందుకు చేశావ్.కోసుకున్నావా? లేదంటే తెగిందా? అని షణ్ముఖ్ అడగ్గా.నార్మల్‌గానే వచ్చిందిలే అని చెప్పింది.