గుంటూరు జిల్లా, తాడేపల్లి: జనసేన ఆవిర్భావ సభకు ప్రాంగణం ఇచ్చిన ఇప్పటంలో గ్రామస్తులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆత్మీయ సమావేశం.ఇప్పటం గ్రామ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ రూ.50లక్షలు ప్రకటిస్తే ఆ మొత్తాన్ని సి.ఆర్.డి.ఎ.కి జమ చేయాలని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది.ఇప్పటం గ్రామస్థులు విరాళాలతో నిర్మించుకున్న కమ్యూనిటీ హాలుకు వైఎస్ఆర్ పేరు పెట్టడం ఏమిటి? పాలన చేతగాక పేర్లు మారుస్తున్నారు.పవన్ కళ్యాణ్ ని పొద్దున్నే విమర్శించకపోతే సాయంత్రానికి పదవి పోతుందని వైసీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు భయపడుతున్నారు.
అందుకే రాజమండ్రిలో కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమై జగన్ పాలనలో కాపులకు చాలా చేశాం అని చెబుతున్నారు.
రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం అమ్మితే వచ్చిన సొమ్ములు కూడా కులాల వారీగా విడదీసి చూడటం దౌర్భాగ్యం.కాపు రైతుల ధాన్యం సొమ్ములు కూడా జగన్ ఇచ్చిన డబ్బులుగా.
చూపించడం ఏమిటి నాదెండ్ల మనోహర్ ప్రసంగిస్తుండగా పవర్ కట్.సెల్ ఫోన్ వెలుగులో మైక్ లేకుండా మాట్లాడారు.ప్రసంగం ముగిశాక వచ్చిన విద్యుత్.