గజిని సీక్వెల్ ఆలోచనలో మురగదాస్.. హీరో సూర్యానేనా.. లేక?

కోలీవుడ్ నటుడు సూర్య మురగదాస్ కాంబినేషన్లో వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం గజినీ.ఈ సినిమా అప్పట్లో సౌత్ ఇండియ ఎలా షేక్ చేసిందో మనకు తెలిసిందే.

 Muragadas Thinking Of Ghajini Sequel Is The Hero Surya Or Not , Muragadas , Ghaj-TeluguStop.com

ఇలా సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ సినిమా ద్వారా సూర్యకు తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులు పెరిగిపోయారు.ఎంతోమంది హీరోలు రిజెక్ట్ చేసిన ఈ సినిమాని సూర్య చేసి హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ సినిమా విడుదలై దాదాపు 14 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఈ సినిమా ఇష్టపడే వారు ఎంతో మంది ఉన్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదలై 14 సంవత్సరాల అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గజిని సినిమా ద్వారా తన మార్క్ చూపించిన మురగదాస్ ఈ సినిమా సీక్వెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయ్యాయని త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందనే వార్త నెట్టింట వైరల్ అయింది.

ఇక గజిని సినిమా సీక్వెల్ రాబోతుందని తెలియడంతో ఎంతోమంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ సీక్వెల్ చిత్రంలో హీరోగా సూర్య నటిస్తారా లేక మురగదాస్ మరెవరినైనా సంప్రదిస్తారా అనే విషయంపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే గజిని సినిమాలో సూర్య తప్ప ఏ ఇతర హీరోలను ఊహించుకోలేమని ఈ సినిమాకి సూర్య పర్ఫెక్ట్ గా సరిపోతారంటూ అభిమానులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఈ విధంగా గజని సీక్వెల్ చిత్రానికి మెల్లిగా అడుగులు పడుతున్నాయని త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube