అక్రమాలకు పాల్పడుతున్న మునుగోడు విద్యుత్ ఏఈ

నల్లగొండ జిల్లా:ఎక్సట్మెంట్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న మునుగోడు విద్యుత్ ఏఈపై చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని మునుగోడు మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఎండి రఫీక్ డిమాండ్ చేశారు.

నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ మునుగోడు మండల పరిధిలోని జమస్తాన్ పల్లి క్రాస్ రోడ్డు వద్ద ఓ ఇంటి యజమాని గత మూడు నెలలు క్రితం ఇంటి కరెంట్ కలక్షన్ కావాలని ఏఇని సంప్రదించగా ఐదు కరెంట్ పోల్స్ కు ఎస్టిమేషన్ వేసి 10% పర్సెంట్ డిడి బ్యాంకులో కట్టాలని, కరెంట్ పోల్స్,వైర్లకు 60 వేలు ఖర్చు వస్తుందని చెబుతూ గత మూడు నెలలుగా తిప్పించుకొని,రెండు రోజుల క్రితం డిడి లేకుండానే పోల్స్,వైర్లు కలెక్షన్ ఇస్తున్నారని,డిడి చేయకుండా ఎలా పనులు చేస్తున్నారని ప్రశ్నించారు.

డీడీ రూపంలో ప్రభుత్వానికి చేరాల్సిన సొమ్ముకు గండి కొడుతూ అక్రమాలకు పాల్పడుతున్న ఏఈపై సంబంధిత ఉన్నత అధికారులు విచారణ చేపట్టి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఇదే విషయమై వివరణ కోసం విద్యుత్ ఏఈ ఎన్.సురేష్ కుమార్ ను చరవాణి ద్వారా సంప్రదించగా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.

Mungodu Vidyut AE Is Committing Irregularities , Committing Irregularities , Mu

Latest Nalgonda News