ఫోన్ ఆడియో వ్యవహారంపై ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చారు.మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి అయిన తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వేసేలా చూడాలని వెంకట్ రెడ్డి ఆడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లు భావించిన ఏఐసీసీ… గత నెల 22న ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.ఈ నోటీసులకు ఆయన వివరణ ఇచ్చారు.