మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్.గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా రిలీజ్ అయ్యి మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఆచార్య సినిమా ప్లాప్ కారణంగా భయపడ్డ మెగా ఫ్యాన్స్ కు ఈ సినిమా పాజిటివ్ టాక్ రావడంతో ఫుల్ ఎగ్జైట్ అయ్యారు.అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో మెగాస్టార్ కూడా సూపర్ హ్యాపీగా ఉన్నారు.
ఇందులో చిరుతో పాటు చాలా మంది స్టార్స్ నటించారు.లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో నటించగా.
సత్యదేవ్ విలన్ పాత్రలో నటించాడు.అలాగే సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్, అనసూయ, సునీల్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.
పండుగ వేళ రిలీజ్ అయ్యి పర్ఫెక్ట్ పండుగ సినిమా అనిపించుకుంది.మెగా ఫ్యాన్స్ ను చాలా రోజుల తర్వాత ఆకట్టుకున్న సినిమా ఇది కావడంతో మంచి రెస్పాన్స్ లభించింది.
తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు కూడా కీలక పాత్రలో నటించాడు.
అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా నటించడంతో ఈ సినిమా మంచి హిట్ అయ్యింది.
మరి థియేటర్స్ లో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో సందడి చేసేందుకు సిద్ధం అవుతుంది.థియేటర్స్ లో రన్ ముగిసినప్పటి నుండి ఓటిటిలో ఎప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటిలో ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతుంది అప్డేట్ వచ్చింది.
నవంబర్ 19 నుండి ఈ సినిమా తెలుగు ఇంకా హిందీ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండనుందట.మరి ఇక్కడ ఎలా అలరిస్తుందో ఎంత రెస్పాన్స్ వస్తుందో చూడాలి.