ప్రచారంలో దూసుకెళుతున్న స్వతంత్ర అభ్యర్థి మొహమ్మద్ నజీర్

నల్లగొండ జిల్లా: నల్లగొండ అసెంబ్లీ నుండి యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ సంస్థ తరుపున స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మొహమ్మద్ నజీర్ ప్రచారంలో దూసుకెళుతున్నారు.

శుక్రవారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం కాశీవారి గూడెంలో ఆయన పేద ప్రజల ఆశీర్వాదం తీసుకుని ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.

తన క్రమ సంఖ్య 27 అని, కత్తెర గుర్తుకు ఓటు వేయాలని తెలుపుతూ,కాశీవారిగూడెం గ్రామం కోసం అద్దంకి బై పాస్ రోడ్డు నుండి ప్రభుత్వంతో కొట్లాడి గ్రామ రోడ్డు మార్గం త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

Mohammad Nazir Is An Independent Candidate Who Is Campaigning, Mohammad Nazir ,

Latest Nalgonda News