సీఎంఆర్ఎఫ్ చెక్కులను పేదలకు అందజేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్లగొండ జిల్లా:సీఎంఆర్ఎఫ్ స్కీం పేదలకు వరం లాంటిదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.నల్లగొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ పరిధిలోని రామన్నపేట, కేతేపల్లి మండలాలకు చెందిన 128 లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ.

59.9 లక్షల చెక్కులను శనివారం నకిరేకల్ లోని తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని,మన ప్రభుత్వం చాలా వేగంగా పనిచేస్తుందన్నారు.

గత ప్రభుత్వంలో ఇవ్వని చెక్కులను నేడు పంపిణీ చేస్తున్నామని,నాగార్జునసాగర్ నిండిన తర్వాత పానగల్ నుండి ఐటిపాముల వరకు నీరు అందిస్తున్నామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పచ్చదనం-పచ్చదనం నేటితో ముగుస్తుందని,ప్రతి ఒక్కరూ 5 నుండి పది చెట్లను నాటాలని, ప్రభుత్వ భూములలో చెట్లను అధికంగా పెంచాలని కోరారు.

MLA Vemula Veeresham Handed Over The CMRF Checks To The Poor , MLA Vemula Veeres

ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి,కేతేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు కంభంపాటి శ్రీనివాస్,నకిరేకల్ మండల పార్టీ అధ్యక్షుడు ఏసుపాదం,మండల నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

తండ్రి రైతు.. కొడుకు ఐఏఎస్.. ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!
Advertisement

Latest Nalgonda News