మహా శివరాత్రి పర్వదినాన ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయక్ ప్రత్యేక పూజలు

నల్లగొండ జిల్లా:మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రక్కన ఉన్న శివాలయాన్ని సందర్శించి,స్వామి వారిని దర్శించుకోని వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ పరమశివుని కరుణా కటాక్షాలతో దేవరకొండ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్,మాజీ మున్సిపల్ చైర్మన్లు ఆలంపల్లి నర్సింహా,వడ్త్య దేవేందర్ నాయక్,మాజి ఎంపీపీ బిక్కు నాయక్, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ,మాజీ సర్పంచ్ పాప నాయక్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయి రాథోడ్,పోగిళ్ళ మాజీ ఉప సర్పంచ్ వెంకటయ్య, సుభాష్ నాయక్,మాజీ ప్రజా ప్రతినిధులు,వివిధ అనుబంధ సంఘాల నాయకులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

MLA Nenawat Balu Naik Special Pooja On Maha Shivratri Day, MLA Nenawat Balu Naik
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Latest Nalgonda News