నల్లగొండ జిల్లా:ఢిల్లీ గడ్డపై గులాబీ జెండా ఎగరటం ఖాయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధీమా వ్యక్తం చేశారు.
శుక్రవారం నకిరేకల్ పట్టణంలో 32 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అంటే కేసిఆర్,కెసిఆర్ అంటే అభివృద్ధి అని,టిఆర్ఎస్ పార్టీ అంటే సంక్షేమ పథకాలకు పుట్టినిల్లని చెప్పుకొచ్చారు.బీజేపీ నాయకులకు సీఎం కేసీఆర్ ని విమర్శించే హక్కు లేదని, మిషన్ కాకతీయ ద్వారా భూగర్భజలాలు పెరిగాయని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు,24 గంటల కరెంట్,రైతు బంధు,రైతు భీమా,కళ్యాణలక్ష్మీ వంటి పథకాలు ఇస్తున్నారని తెలిపారు.
ఉద్యోగ,ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు.బీజేపీ నాయకులకు సీఎం కేసీఆర్ ని విమర్శించే హక్కు లేదన్నారు బీజేపీ,ఆర్ఎస్ఎస్ కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు.
పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తూ తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని,ఇది బీజేపీ నాయకులకు కనబడడం లేదా అని ప్రశ్నించారు.
Latest Nalgonda News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy