లెఫ్ట్ నేతలతో మంత్రి సమావేశం

నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నికపై అనుసరించాల్సిన వ్యూహలపై చర్చించేందుకు సీపీఐ,సీపీఐ(ఎం)నేతలతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సీపీఐ(ఎం)నుండి మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నల్లగొండ,యాదాద్రి జిల్లాల కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి,జహంగీర్,సీపీఐ నుండి పల్లా వెంకట్ రెడ్డి,ఉజ్జిని యాదగిరి రావు,నల్లగొండ,యాదాద్రి జిల్లాల కార్యదర్శులు నెల్లికంటి సత్యం,గోదా శ్రీరాములు పాల్గొనగా టీఆర్ఎస్ నుండి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జ్,ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు,నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Minister's Meeting With Left Leaders-లెఫ్ట్ నేతలతో �

Latest Nalgonda News