ప్రస్తుత కాలంలో కొందరు అవసరాలు తీరిపోయిన తర్వాత వయసైపోయిన తమ తల్లిదండ్రులను అనాధ శరణాలయాలకు పరిమితం చేస్తుంటారు.కానీ ఓ వ్యక్తి తన కన్న తండ్రిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో లాక్ డౌన్ కారణంగా వారు ప్రయాణిస్తున్నటువంటి వాహనాన్ని నిలిపివేయడంతో తన కన్న తండ్రిని ఆ వ్యక్తి భుజాన వేసుకుని దాదాపుగా కిలోమీటర్ దూరం పైనే మోసుకుంటూ ఇంటికి తీసుకెళ్లిన ఘటన దేశంలోనే కేరళ రాష్ట్రంలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే తే స్థానిక రాష్ట్రంలోని పునలూరు పరిసర ప్రాంతంలో ఓ వ్యక్తి తన తల్లిదండ్రులతో నివాసం ఉంటున్నాడు.అయితే ఇటీవలే ఆ వ్యక్తి తండ్రి అనారోగ్యం కారణంగా తన నివాసానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నవటువంటి ఆస్పత్రిలో చేర్పించారు.
అయితే తాజాగా ఆ వ్యక్తి అనారోగ్యం నుంచి కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వాహనంలో వెళ్తుండగా పోలీసులు లాక్ డౌన్ కారణంగా వాహనాన్ని నిలిపి వేశారు.
దీంతో ఆ వ్యక్తి ఇక చేసేదేమీ లేక తన కన్న తండ్రిని భుజంపై వేసుకొని కిలోమీటర్ దూరం పాటు మోసుకుంటూ వెళ్ళాడు.
అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ వ్యక్తి తన తన తండ్రిని భుజంపై మోసుకుంటూ వెళుతున్న సమయంలో అందరూ చోద్యం చూస్తూ ఉండిపోయారు తప్ప ఎవరూ కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు.పైగా ఈ విషయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
అయితే ఈ విషయాన్ని ఇలా ఉండగా గతంలో కూడా ఎంతో మంది నిరుపేదలు మరియు పూటగడవని కూలీలు, వలస కార్మికులు, కుటుంబ పోషణ నిమిత్తమై పట్టణాలకు నగరాలకు వలస వచ్చి తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్లేందుకు గాను ఎంతో కష్టపడుతున్నారు.ఈ క్రమంలో కొందరైతే ఏకంగా మూటాముల్లె సర్దుకుని నెత్తిన పెట్టుకొని రోడ్లవెంబడి నడుచుకుంటూ వెళుతున్న ఘటనలు కోకొల్లలు.