హాలియాలో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు

నల్లగొండ జిల్లా:హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ట్రాఫిక్ సమస్యలకు కారణమైన తోపుడు బండ్లు,కూరగాయల బండ్లను శుక్రవారం మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ,ఎస్సై సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో మెయిన్ సెంటర్,అంగడి బజార్, నాగార్జునసాగర్, దేవరకొండ,మిర్యాలగూడ రోడ్లపై ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని రోడ్ల వెంట,ఫుట్ పాత్ పైన, వ్యాపార షాపుల ముందు ఏర్పాటు చేసిన చిరు వ్యాపారులు బండ్లను తొలగించారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తోపుడు బండ్లు గాని, కూరగాయల బండ్లు గాని ఫుట్ పాత్ పై పెట్టడం వలన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుందని,ట్రాఫిక్ నియమనిబంధనలు అతిక్రమించి ఎవరైనా ఎంతటి వారైనా తీసివేసిన తోపుడు బండ్లను ఫుట్ పాత్ పై మరల ఏర్పాటు చేసి,ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అందరం సహరించుకొని మునిసిపాలిటీని పరిశుభ్రంగా ఉంచుకుందామన్నారు.ఈ కార్యక్రమంలో హాలియా పోలీస్,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజనమా...మరణ ఆహారమా...?

Latest Nalgonda News