యాదాద్రి భువనగిరి జిల్లా:గత ఐదేళ్లు ఆలేరు మున్సిపాలిటికి సరైన నిధులు రాక అభివృద్ధిలో కుంటుపడిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలసి తొలిసారి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కొన్ని నెలల్లోనే కేంద్ర నుంచి నిధులు తెచ్చి ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఎంపీ నేను అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతామని, గతంలో తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, కమిషనర్ లక్ష్మి,వైస్ చైర్మన్ మాధవి,కౌన్సిలర్లు చింతలపాటి సునీత, శమంతకరెడ్డి,బేతి రాములు,జూకటి శ్రీకాంత్, సంగు భూపతి,ముహూర్తాల సునీత,ఏఈ,డిప్యూటీ తహసిల్దార్ పాల్గొన్నారు.