దీపావళికి ‘మాస్టర్’ ప్లాన్ వేసిన విజయ్

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్టర్ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.అయితే ఈ సినిమా రిలీజ్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

 Master Teaser On Diwali, Vijay, Master, Vijay Sethupathi, Lokesh Kanagaraj, Diwa-TeluguStop.com

ఈ సినిమాను తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో స్టార్ నటుడు విజయ్ సేతుపతి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

అయితే ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా కరోనా కారణంగా వాయిదా పడ్డ మాస్టర్ చిత్రం ఇప్పట్లో రిలీజ్ అయ్యే సూచనలు ఏమీ కనిపించడం లేదు.

దీంతో ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారనే టాక్ తమిళ సినీ వర్గా్లో జోరుగా వినిపిస్తోంది.సంక్రాంతి రిలీజ్ అంటే ఇంకా చాలా సమయం ఉందని, ఈ లోపు చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుందేమో అనే సందేహం అందరిలోనూ నెలకొంది.

దీంతో చిత్ర యూనిట్ ఓ మాస్టర్ ప్లా్న్ చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ టీజర్‌ను దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని మాస్టర్ యూనిట్ భావిస్తోంది.

దీంతో దీపావళికి రాబోయే టీజర్‌తో విజయ్ అదిరగొట్టేందుకు రెడీ అవుతున్నాడని ఆయన ప్రేక్షకులు అంటున్నారు.ఇక ఈ సినిమాలో మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే.మరి దీపావళికి రానున్న టీజర్ ఎలా పేలుతుందో తెలియాలంటే పండగ వరకు ఆగాల్సిందే అంటున్నారు తమిళ సినీ వర్గాలు.

మరి ఈ సినిమాతో మాస్టర్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube