ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య

నల్లగొండ జిల్లా:కట్టంగూరు మండలం ఎర్రసానిగూడెం గ్రామానికి చెందిన యాపాల సంపత్ కుమార్ రెడ్డి(24) ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో పైకప్పుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు.

మృతుడు ఎంసీఏ వరకు చదువుకొని,ఉద్యోగ ప్రయత్నాలతో పాటు అమెరికా వెళ్లేందుకు పలుమార్లు ప్రయత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది.

Latest Nalgonda News