సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణంలోని కోర్టుకు ఎదురుగా చావాది లక్ష్మి చాయ్ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది.శనివారం సాయంత్రం టీ పెడుతున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పైపు లీక్ అవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.
మంటలను అర్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొన్న ఫైర్ ఇంజన్ మంటలను అదుపులోకి తెచ్చింది.ఈ ప్రమాదంలో సుమారు రూ.20 వేల ఆస్తినష్టం జరిగినట్లు,తన జీవనోపాధి కోల్పోయినట్లు, ప్రభుత్వం తనను ఆదుకోవాలని టీ స్టాల్ నిర్వాహకులు విలసించింది.







