తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి 50 కోట్ల గ్రాస్ చిత్రం మహేష్ బాబు పోకిరి.రాజమౌళి తరువాత తొలి 100 కోట్ల గ్రాస్ వసూళ్లు మహేష్ వే.
అలాగే రాజమౌళి తరువాత తొలి 150 కోట్ల గ్రాస్ వసూళ్ళు కూడా మహేష్ వే.కాబట్టి ఫామ్ లో లేకున్నా, మహేష్ బాబు లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కేట్ ఉన్న సూపర్ స్టార్ ని తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు.రికార్డులు మహేష్ కి కొత్త కాదు.ఇప్పుడు బాహుబలి తరువాత తొలి 200 కోట్ల గ్రాస్ మహేష్ దే కాబోతోంది అని ట్రెడ్ వర్గాల అంచనా.అన్ని కుదిరితే ఈ లెక్క 300 కోట్లు కూడా దాటవచ్చు.మేం మాట్లాడుతున్నది స్పైడర్ గురించి అని మీకు ఇప్పటికే అర్థమయిపోయింది అనుకుంటా.
శ్రీమంతుడు లాంటి రెగులర్ సినిమాతోనే 150 కోట్ల గ్రాస్ వసూళ్ళు సాధించిన మహేష్ టార్గేట్ ఇప్పుడు 300 కోట్లు.ట్రేడ్ లో స్పైడర్ వేడి మామూలుగా లేదు.
ఒక్క టీజర్ కుడా రాకున్నా, బాహుబలి తరువాత అన్ని బిజినెస్ రికార్డులు ఈ సినిమానే క్రియేట్ చేస్తోంది.పెరిగిన మార్కెట్, టికేట్ రేట్లు, మూడు నాలుగు భాషల్లో విడుదల, ఇవన్ని దృష్టిలో పెట్టుకోని స్పైడర్ 300 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకుల మాట.మంచి టాక్ వస్తే తెలుగు వెర్షన్ 200-250 కోట్లు చేసే అవకాశాలున్నాయి.ఇక తమిళం, మలయాళం హిందీ కలుపుకోని 300 కోట్ల మార్కుని దాటేయాలి స్పైడర్.
చూద్దాం మరి ఈ లెక్కలను స్పైడర్ అందుకుంటుందో లేక ఈ లెక్కలను దాటి కలెక్ట్ చేస్తుందో.
ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో జరుగుతోంది.మే 31వ తేదిన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా స్పైడర్ టీజర్ ఒకటి బయటకి రానుందని సమాచారం.ఇక ఈ 100 కోట్ల బడ్జెట్ సినిమాని ఆగష్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.