మహేష్ బాబు.సూపర్ స్టార్ క్రిష్ణ తనయుడిగా.
నట వారసుడిగా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు.చక్కటి సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగాడు.
ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.ఇప్పటి వరకు తను నటించిన 6 సినిమాలు 100 కోట్ల క్లబ్బులో చేరడం విశేషం.
ఈ రికార్డు సాధించిన తొలి హీరోగా నిలిచాడు.ఇంతకీ ఆయన నటించిన 100 కోట్ల మూవీలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సరిలేరు నీకేవ్వరు
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్ల రూపాయలు వసూళు చేసింది.పాజిటివ్ టాక్ తో ముందుకు సాగిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డు సాధించింది.
భారత్ అనే నేను
ఈ సినిమా 120 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.రెండో రోజుల్లోనే రూ.100 కోట్ల్ క్లబ్‌లో చేరింది.ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకుపైగా థియేటర్లలో సూపర్ స్టార్ సినిమా విడుదలైంది.పాజిటివ్ టాక్ కారణంగా తొలి వారంలోనాన్ బాహుబలి రికార్డులను భరత్ బ్రేక్ చేశాడు.
మహర్షి
మహేష్ బాబు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి మూవీ బాక్సాఫీసు దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టించింది.తొలి వారంలోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
శ్రీమంతుడు
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు మూవీ బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది.ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర రూ.144.5 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది.
స్పైడర్
మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది.ఈ మూవీ తొలి రోజు రూ.51 కోట్లు, రెండో రోజు రూ.71 కోట్ల క్లబ్‌లో చేరింది.ఈ మూవీ తొలి వారంలోనే రూ.100 కోట్ల క్లబ్‌ను క్రాస్ చేసింది.
దూకుడు
శ్రీను వైట్ల, మహేష్ బాబు హీరోగా చేసిన ఈ సినిమా సైతం 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది.2011 లో వచ్చిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా చేసింది.14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దూకుడు మూవీని నిర్మించారు.