ఆర్ఆర్ఆర్ టీమ్ కు చుక్కలు చూపిస్తున్న మహేష్ బాబు అభిమానులు.. కారణం ఇదే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా విడుదల అయినప్పటి నుంచి అభిమానులు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 Mahesh Babu Fans Gets Hurt Over Rrr Team Tweet On Sivakarthikeyan Don Movie , Mahesh Babu, Tollywood, Rrr, Sivakarthikeyan, Don Movie-TeluguStop.com

అయితే అందుకు గల కారణం కూడా లేకపోలేదు.ఎందుకంటే సర్కారు వారి పాట సినిమా విడుదల అయి నాలుగు రోజులు అవుతున్నా కూడా సినిమా గురించి టాలీవుడ్ లోని దర్శకనిర్మాతలు కానీ హీరోలు ఎవరు స్పందించకపోవడంతో అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అదే వేరే సినిమా రిలీజ్ అయి ఉంటే మహేష్ బాబు ఈపాటికి ఆ సినిమా యూనిట్ కంగ్రాట్స్ చెప్పేవాడు లేదంటే మాట సహాయం అయినా చేసేవాడు అంటూ అభిమానులు మండిపడుతున్నారు.అంతేకాకుండా సర్కారు వారి పాట సినిమాపై కావాలి అనే నెగిటివ్ గా ట్రెండ్స్ చేస్తున్నారు అంటూ అభిమానులు వాపోతున్నారు.

 Mahesh Babu Fans Gets Hurt Over Rrr Team Tweet On Sivakarthikeyan Don Movie , Mahesh Babu, Tollywood, Rrr, Sivakarthikeyan, Don Movie-ఆర్ఆర్ఆర్ టీమ్ కు చుక్కలు చూపిస్తున్న మహేష్ బాబు అభిమానులు.. కారణం ఇదే-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన డాన్ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం పై అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.మహేష్ బాబు ఆర్ఆర్ఆర్ ఈ సినిమా గురించి ఒక ట్వీట్ చేశాడు.

అలాంటిది మీరు ఇంతవరకు సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన ఒక ట్వీట్ వేయలేదు.కానీ తమిళ సినిమా గురించి ట్వీట్ చేస్తారా అంటూ ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.అంతేకాకుండా కొంత మంది దారుణంగా బూతులు కూడా తిడుతున్నారు.మొత్తానికి సర్కారు వారి పాట సినిమా విడుదల అయ్యి నాలుగు రోజులు అవుతున్నా కూడా ఈ సినిమాకు టాలీవుడ్ నుంచి సరైన స్పందన రావడం లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube