కోల్ కతాలో డాక్టర్ పై అత్యాచార, హత్య నిందితులను కఠినంగా శిక్షించాలి: ఎస్ఎఫ్ఐ

నల్లగొండ జిల్లా: కోల్ కతా నగరంలో ఆర్జిగర్ ప్రభుత్వ ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజ్ లో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్న మహిళ డాక్టర్ ను అమానుషంగా అత్యాచారం చేసి,హత్య చంపేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ ఉపాధ్యక్షుడు నేరలపల్లి జై చరణ్ డిమాండ్ చేశారు.

శనివారం నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని సాయి ప్రకాష ఒకేషనల్ జూనియర్ కళాశాలలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆమె చిత్రపటానికి క్యాండిల్ వెలిగించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతిరోజు ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని, అత్యాచారం-హత్యలను నిలువరించడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని,నిర్లక్ష్యం వీడకపోతే ఇవి ఇంకా పెరిగి అరాచకత్వం పరిఢవిల్లె ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.మహిళా జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం,హత్య ఒకరే చేశారని నమ్మించి,ఒక వ్యక్తిని అరెస్టు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం జరుగుతుందని,ఇది సామూహిక అత్యాచారమని డాక్టర్లు చెబుతున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం సరికాదన్నారు.

ప్రభుత్వాలు భేటీ బచావో బేటి పడావో, సబ్కా సాథ్-సబ్కా వికాస్ అని ఘనమైన నినాదాలు ఇస్తున్న దేశంలో ఆడపిల్లలకి రక్షణ కల్పించలేకపోవడం పాలకుల వైఫల్యానికి నిదర్శనమన్నారు.నిందితులందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు ఆడెపు సిద్దు, రాజు,అనిల్, విద్యార్థినిలు భవాని,పావని,సోని,మంజుల, రజిత,రమ్య,పల్లవి,రేణుక, సాహితీ తదితరులు పాల్గొన్నారు.

చిన్నారుల్లో మధుమేహం రావడానికి కారణాలేంటి.. ఎలా గుర్తించాలి..?

Latest Nalgonda News