సర్వేలు.అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీ సీఎం చంద్రబాబు.తెలంగాణ సీఎం కేసీఆర్.వీటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.ఏ నిర్ణయం తీసుకున్నా దాని మీద సర్వే నిర్వహించి అందులో వచ్చిన ఫలితాల ఆధారంగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇక ఎమ్మెల్యేలు, మంత్రులపై వీరు చేయించిన సర్వేలకు లెక్కేలేదు.
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.వీటిని మరింత ముమ్మరం చేశారు.
ఈ విషయంలో చంద్రబాబు కంటే ఒకడుగు ముందురున్నారు కేసీఆర్! తమ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో చెప్పడంతో పాటు ప్రత్యర్థి పార్టీలు గెలిచే సీట్లపైనా ఆయన సర్వేలు చేయించి ఆశ్చర్యపరుస్తుంటారు.ఇప్పటికి రెండు సార్లు సర్వే చేయగా.
ముచ్చటగా మూడో సర్వే ఫలితాలు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉందట.
తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైపోయింది.
ఎన్నికలు ఈ ఏడాది చివరిలోనే జరుగుతాయని సీఎం కేసీఆర్ గట్టి నమ్మకంతో ఉన్నారు.ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్ దక్కుతుంది.
ఎవరిని ఈసారి పక్కనపెడతారు అనే చర్చ గులాబీ దళంలో మొదలైంది.సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని చెబుతున్నా.
సర్వేల్లో వచ్చే ఫలితాల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి.అందుకే గత రెండు సర్వేల్లో వెనుక బడి ఉన్న ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు చరుగ్గా పనిచేస్తున్నారు.
రాష్ట్రంలోని పరిస్థితులపై కేసీఆర్ మూడు సార్లు సర్వే నిర్వహించారు.రెండు సర్వేల ఫలితాల్లోనూ.
టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని తేలింది.
పార్టీ పరిస్థితిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మూడు సర్వేలు చేయించినట్లు తెలుస్తోంది.మూడు సర్వేల్లో ఇప్పటికే రెండు సర్వేల ఫలతాలు వచ్చాయి.
మరో సర్వే ఫలితాలు రావాల్సి ఉంది.టీఆర్ఎస్‌లో వందకుపైగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని ఆ రెండు సర్వేలు తేల్చాయి.
కేసీఆర్ మూడు వేర్వేరు సంస్థలతో సర్వేలకు ఆదేశించినట్లు సమాచారం.ఈ సర్వేలు దాదాపు ది లక్షల మందిని సంప్రదించాయి.
రెండు సర్వేల్లో కూడా టీఆర్ఎస్‌కు వందకు పైగా స్థానాలు వస్తాయని తేలింది.అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 119.టీఆర్ఎస్‌కు 105 స్థానాలు వస్తాయని ఓ సర్వే చెప్పగా, 103 స్థానాలు వస్తాయని మరో సర్వే అంచనా వేసింది.
మూడో సర్వే నివేదిక వచ్చిన తర్వాత సమావేశం ఏర్పాటు చేస్తానని కేసీఆర్ మంత్రులకు, శాసనసభ్యులకు చెప్పారు.
బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని ఓ సర్వే చెప్పగా, హైదరాబాదులో ఓ సీటు గెలుచుకుంటుందని మరో సర్వే అంచనా వేసింది.ప్రస్తుతం ఐదుగురు బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు.
కాంగ్రెసు వచ్చే ఎన్నికల్లో ఏడు నుంచి 9 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని సర్వేలు తేల్చాయి.ప్రస్తుతం శాసనసభలో కాంగ్రెసుకు 21 స్థానాలున్నాయి.
అయితే, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి కనీసం 70 అసెంబ్లీ స్థానాలు వస్తాయని కాంగ్రెసు పార్టీ సర్వేలో తేలినట్లు చెబుతున్నారు.మెజారిటీ నియోజవర్గాల్లో కాంగ్రెసు పార్టీకి 20 శాతం కన్నా తక్కువ ఓట్లు వస్తాయని కేసీఆర్ చేయించిన సర్వేలో తేలింది.
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో మాత్రం కాంగ్రెసు ఓట్ల శాతం 37 నుంచి 45 వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.