రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్.. ఆ జెండాతో క్లారిటీ వచ్చినట్టే..?

ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉందనే సంగతి తెలిసిందే.ప్రజల్లో పూర్తిస్థాయిలో విశ్వాసాన్ని కోల్పోయిన టీడీపీ పుంజుకుంటుందని ఆ పార్టీ నేతలే భావించడం లేదు.

 Jr Ntr Flag In Kuppam Photo Goes Viral In Social Media, Junior Ntr , Ntr Politic-TeluguStop.com

ఇలాంటి సమయంలో ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ భారీస్థాయిలో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను సాధించే అవకాశాలు కనిపించడం లేదు.అయితే టీడీపీని అభిమానించే అభిమానులు మాత్రం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు.

ముఖ్యంగా చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంకు చెందిన టీడీపీ అభిమానులు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కుప్పం మండలంలోని పంచాయములకలపల్లి అనే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఆభిమానులు ఎన్టీఆర్ ఫోటోతో కూడిన కొత్త జెండాను తయారు చేయడంతో పాటు ఆ జెండాను ఆవిష్కరించారు.

ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని టీడీపీ అభిమానులు ఈ విధంగా చాటుకోవడం గమనార్హం.

Telugu Ntr-Telugu Political News

గతంలో కుప్పంలో చంద్రబాబు పర్యటించిన సమయంలో సైతం ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలని టీడీపీ అభిమానులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు.అటు క్లాస్ లోనూ, ఇటు మాస్ లోనూ యంగ్ టైగర్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తాత పోలికలు ఉండటం కూడా ఎన్టీఆర్ కు ఒకింత ప్లస్ అవుతుండటం గమనార్హం.

తన మాటలతో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరినీ ఆకట్టుకునే ప్రతిభ ఎన్టీఆర్ కు ఉంది.

Telugu Ntr-Telugu Political News

గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం నిర్వహించడంతో పాటు పార్టీకి అవసరమైన సమయంలో తన వంతు సహాయసహకారాలు అందిస్తానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఎన్టీఆర్ చేరితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తుండగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస మూవీ ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube