తెలుగు రాష్ట్రల దేవాలయలలో నేడు కార్తీక శోభ

నల్లగొండ జిల్లా: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సోమవారం కార్తీక శోభ సంతరించుకుంది.మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు.

తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు ఆలయాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి,స్నానఘాట్లు, ఆలయం ఎదుట గంగాధర మండపం,ఆలయ ఉత్తర మాఢవీధుల్లో కార్తిక దీపారాధన చేశారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడకు భక్తులు పోటెత్తారు.స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఆలయం ఆవరణలో కార్తిక దీపాలు వెలిగించారు.అదేవిధంగా నగరంలోని శివాలయాల్లో భక్తులు కార్తిక దీపారాధన చేశారు.

Advertisement

Latest Nalgonda News