రెండో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన వెటరన్ హీరోయిన్...

తెలుగు ప్రముఖ స్వగీయ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ మరియు తెలుగు ప్రముఖ హీరో అల్లరి నరేష్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన బెండప్పారావు ఆర్ఎంపీ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన కన్నడ హీరోయిన్ మేఘనా రాజ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.నటి మేఘన రాజ్ 2018 వ సంవత్సరంలో కన్నడ ప్రముఖ హీరో “చిరంజీవి సర్జ” ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ దురదృష్టవశాత్తు గత ఏడాది చిరంజీవి సర్జా కరోనా వైరస్ కారణంగా మృతి చెందాడు.

 Kannada Heroine Meghana Raj Clarity About Second Marriage , Kannada Heroine, Kan-TeluguStop.com

దీనికి తోడు చిరంజీవి సర్జా మృతిచెందిన సమయంలో మేఘనారాజ్ ఐదు నెలల గర్భవతి గా ఉండడంతో తన భర్త మృతిని తట్టుకోలేక పోయింది అయినప్పటికీ తన కడుపు లో ఉన్నటువంటి బిడ్డ కోసం తన భర్త తిరిగి రాడన్న బాధని దిగమింగి గత ఏడాది అక్టోబర్ 22న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.ఇటీవలే తన బిడ్డకి “రాయన్ రాజ్” అని నామకరణం కూడా చేసింది.

అయితే గత కొద్ది రోజులుగా నటి మేఘన రాజ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే మేఘనారాజ్ ప్రముఖ రియాల్టీ గేమ్ షో అయిన కన్నడ “బిగ్ బాస్ గేమ్ షో” లో విజేతగా నిలిచిన కంటెస్టెంట్ ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతోందని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.దీంతో చివరికి ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకుతూ మేఘనా రాజ్ చెవిన వినపడింది.

దాంతో ఇటీవలే మేఘనా రాజ్ ఈ విషయంపై తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందించింది.ఇందులో భాగంగా తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వినిపిస్తున్న వార్తలలో నిజం లేదని స్పష్టం చేసింది.

అంతేకాకుండా తనకి తన భర్త చిరంజీవి సర్జా సర్వస్వమని అతడి స్థానంలో మరో వ్యక్తికి చోటు లేదని అలాగే తన జీవితంలో పెళ్లికి కూడా స్థానం లేదని కొంతమేర ఎమోషనల్ అయ్యింది.అలాగే సినీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి ప్రచారాలు చేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలని లేకపోతే ఇరువురు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మేఘనా రాజ్ కన్నడ భాషలో “సెల్ఫీ మమ్మీ గూగుల్ డాడీ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.కాగా ఈ చిత్రానికి కన్నడ ప్రముఖ దర్శకుడు మధు చంద్ర దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

కాగా ఇటీవలే మేఘనా రాజ్ కన్నడ ప్రముఖ హీరో ఉపేంద్ర హీరోగా నటిస్తున్న “బుద్దివంత 2” చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube