పచ్చి అబద్దం చెబుతున్న కాజల్‌!       2018-07-02   00:43:53  IST  Raghu V

తేజ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కాజల్‌ పరిచయం అయ్యింది. ఆ చిత్రం పెద్దగా గుర్తింపు తీసుకు రాలేక పోయింది. అయితే ఆ తర్వాత నటించిన ‘చందమామ’ చిత్రంతో కాజల్‌ ఒక్కసారిగా గుర్తింపు దక్కించుకుంది. దాంతో స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఆసమయంలోనే రాజమౌళి, రామ్‌ చరణ్‌ల ‘మగధీర’ చిత్రంలో నటించి టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా మారిపోయింది. దాదాపు దశాబ్ద కాలం పాటు టాప్‌ హీరోయిన్‌గా దూసుకు పోయిన కాజల్‌ ఈమద్య కాలంలో కాస్త డల్‌ అయ్యింది.

టాలీవుడ్‌లో దాదాపు టాప్‌ హీరోలందరితో నటించేసిన కాజల్‌ ప్రస్తుతం చిన్న హీరోలతో చెట్టాపట్టాలేసుకుని నటించేస్తోంది. ఇటీవలే శర్వానంద్‌తో ఒక చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఈ అమ్మడు తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్‌కు జోడీగా నటించేందుకు ఓకే చెప్పింది. ప్రస్తుతం ఈమె నటించబోతున్న రెండు చిత్రాలకు కూడా భారీ పారితోషికాలు అందుకుంటుంది. చిన్న హీరోలు అవ్వడం వల్ల ఈమెకు నిర్మాతలు ఎక్కువ పారితోషికం ముట్టజెప్పుతున్నారు. నిర్మాతలను ముక్కు పిండి మరీ భారీగా రెమ్యూనరేషన్‌ దక్కించుకుంటున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది. అయితే కాజల్‌ పైకి మాత్ర అంత లేదు అన్నట్లుగా చెబుతూ వస్తుంది.

కాజల్‌ అగర్వాల్‌ తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్‌ చిత్రంలో నటించేందుకు ఏకంగా రెండు కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకుంటుంది. అయితే పైకి మాత్రం తేజ గారిపై అభిమానంతో మరియు కథ నచ్చడంతో గత చిత్రాల కంటే తక్కువ పారితోషికం తీసుకుంటున్నట్లుగా చెబుతూ ఉంది. ఇప్పటి వరకు బెల్లంకొండ శ్రీనివాస్‌తో నటించిన స్టార్‌ హీరోలు అంతా కూడా రెండు కోట్లకు పైనే పారితోషికం అందుకున్నారు. అదే విధంగా ఈ చిత్రం కోసం కూడా కాజల్‌ తక్కువ పారితోషంకం అంటూ చెబుతున్నా కూడా రెండు కోట్లకు ఎక్కువగానే తీసుకుని ఉంటుందని సినీ వర్గాల వారు అంటున్నారు.

దర్శకుడు తేజ కథ చెప్పగానే ఆ పాత్రను తానే చేయాలని భావించాను. అందుకే పారితోషికం కాస్త తక్కువ అయినా పర్వాలేదు, పాత్ర మరెవ్వరికి ఛాన్స్‌ ఇవ్వొద్దు అంటూ కోరినట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈమె చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్దం అని, అసలు పారితోషికం విషయంలో కాజల్‌ ఎప్పుడు కూడా వెనక్కు తగ్గదు అంటూ ఆమెకు సన్నిహితంగా ఉండే వారు కొందరు చెబుతున్నారు. కాజల్‌ మంచి పేరు కోసం తక్కువ పారితోషికంతోనే బెల్లంకొండ హీరోతో సినిమా చేస్తున్నట్లుగా చెబుతున్నట్లుగా అనిపిస్తుంది.