ఇదేం చెత్త ప్లానింగ్.. హర్ట్ అవుతున్న ఫ్యాన్స్.. ఎన్టీఆర్ జోక్యం చేసుకుంటారా?

మే నెల 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్( Junior ntr ) పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.తారక్ పుట్టినరోజు సందర్భంగా తారక్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలో రీరిలీజ్ అవుతున్నాయి.

 Junior Ntr Fans Not Happy With Movie Release Plannig Details Here Goes Viral ,-TeluguStop.com

మే నెల 19వ తేదీన నిన్ను చూడాలని సినిమా రీరిలీజ్ అవుతుండగా మే నెల 20వ తేదీన సింహాద్రి, ఆది ( Simhadri )సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి.ఆది సినిమాను మే నెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రదర్శించనున్నారు.

అయితే రెండు రోజుల గ్యాప్ లో ఎన్టీఆర్ నటించిన మూడు సినిమాలు రిలీజ్ అవుతుండటంపై ఫ్యాన్స్ ఏ మాత్రం సంతోషంగా లేరు.ఈ సినిమాల రీరిలీజ్ విషయంలో ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.ఎన్టీఆర్ జోక్యం చేసుకుని వేర్వేరు తేదీలలో ఈ సినిమాలను రిలీజ్ చేస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తెగ హర్ట్ అవుతుండటం గమనార్హం.

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా రానున్నాయి.వార్2 సినిమాలో( War 2 ) ఎన్టీఆర్ రోల్ కు సంబంధించి కూడా ఆరోజే స్పష్టత రానుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఎన్టీఆర్ పారితోషికం సైతం పెరుగుతున్న సంగతి తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ కు తెలియకుండానే ఆయన నటించిన సినిమాల రీరిలీజ్ లను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.మూడు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో కొందరు ఫ్యాన్స్ వెటకారంగా ఎన్టీఆర్ నటించిన 29 సినిమాలను రీరిలీజ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.జూనియర్ ఎన్టీఆర్ ఇకపై వేగంగా సినిమాల్లో నటించాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండగా 300 కోట్ల రూపాయలను మించిన బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube