బీఆర్ఎస్,బీజేపీ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

నల్లగొండ జిల్లా:దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని గుడిపల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు చెందిన సుమారు 30 కుటుంబాలు శుక్రవారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఎమ్మేల్యే వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సర కాలంలో రైతులకు ఋణ మాఫీ,వరి పండించిన రైతులకు రూ.500/- బోనస్,మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, యువతకు 55 వేల ఉద్యోగాలు భర్తీ,గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విధ్యుత్, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం 5లక్షల నుండి 10 లక్షలకు పెంపు,మహిళా సంఘాలకు రుణాలు, గ్యాస్ సబ్సిడీ,ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల మంజూరు లాంటి పథకాలు చేపట్టడం జరిగిందన్నారు.ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని చెప్పారు.

అనంతరం పార్టీలో చేరిన పలువురు నేతలు మాట్లడుతూ దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో అభివృద్ధికి అడుగులు వేసే దిశగా ప్రజా పాలన నడుస్తున్నందున పార్టీలో చేరినట్లు తెలిపారు.పార్టీలో చేరిన వారిలో సూరబోయిన రమేష్, యర్ర శ్రీను,బూతం యాదగిరి,సిడిగం ఆంజనేయులు,తోకల సత్తయ్య,వెంకటయ్య,యర్ర యాదయ్య,వట్టేపు యాదగిరి తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో పిఏ పల్లి కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ వీరబోయిన ఎల్లయ్య,వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, మాజీ ఎంపిటిసి వడ్లపల్లి చంద్రారెడ్డి,యువజన కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కొర్ర రాంసింగ్, సీనియర్ నాయకులు కుక్కల గోవర్ధన్ రెడ్డి, సముద్రాల పరమేశ్, కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జానపాటి వెంకటయ్య, జానపాటి రామలింగం, యూత్ గ్రామ శాఖ అధ్యక్షులు కోట్ల శ్రీరాములు,పడాల సైదులు,భూతం సైదులు, యర్ర రూతమ్మ తదితరులు పాల్గొన్నారు.

How Modern Technology Shapes The IGaming Experience
Advertisement

Latest Nalgonda News