నాలుగు జిల్లాల కలెక్టర్లకు తెలంగాణ హైకోర్టు నోటీసులు

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం విషయమై నాలుగు జిల్లాల కలెక్టర్లకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.జనగాం,యాదాద్రి భువనగిరి,జయశంకర్ భూపాలపల్లి,ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

 Telangana High Court Notices To Collectors Of Four Districts , Janagam, Yadadri-TeluguStop.com

రైతు ఆత్మహత్యలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై గత ఏడాది హైకోర్టులో విచారణ జరిగింది.పరిహారం ఇచ్చే అంశం పరిశీలనలో ఉందని, నాలుగు నెలల్లో చెల్లిస్తామని అప్పుడు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

అయితే ఏడాది దాటినప్పటికీ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించలేదంటూ కొండల్ రెడ్డి అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు నాలుగు జిల్లాల కలెక్టర్లకు నోటీసులు ఇచ్చింది.

ఈ పిటిషన్‌ను కోర్టు ధిక్కరణ కింద ఎందుకు స్వీకరించకూడదో చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube