కాల్పుల విరమణ దిశగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం..!!

ఇజ్రాయెల్ హమాస్( Israel Hamas ) యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని మిగతా దేశాలు అభిప్రాయపడుతున్నాయి.అక్టోబర్ 7వ తారీకు మొదలైన ఈ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

 Israel Hamas War Towards Ceasefire Gaza, Israel Hamas War, Israel , Palestine-TeluguStop.com

ఈ క్రమంలో అరబ్ దేశాలు ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న దాడులను ఆపాలని ఖండిస్తూనే ఉన్నాయి.కొద్ది రోజుల క్రితం అరబ్ దేశాల నాయకులు సౌదీ అరేబియా( Saudi Arabia )లో సమావేశమై.

ఇజ్రాయెల్ కు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది.గాజాలో ఇజ్రాయెల్ బలగాలు వెంటనే వెనక్కి పంపించాలని.

సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కొంతమంది నాయకులు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఈ యుద్ధం ముగింపు దశకు వచ్చినట్లు తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి.

విషయంలోకి వెళ్తే అక్టోబర్ 7వ తారీకు కిడ్నాప్ చేసిన వారిలో 70 మందిని విడుదల చేయడానికి హమాస్ ఒప్పుకోవటం జరిగిందట.ఈ క్రమంలో గాజాలో ఐదు రోజులపాటు ఎటువంటి దాడులు చేయబోమని ఇజ్రాయెల్ హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు తమ జైల్లో ఉన్న పాలస్తీనా( Palestine ) వాసులను విడుదల చేయడానికి కూడా ఇజ్రాయెల్ అంగీకరించిందట.ఈ రకంగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లు.

కాల్పుల విరమణ దిశగా రెండు వర్గాల మధ్య అంగీకారం కుదిరినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube