నగరి వైసిపి ఎమ్మెల్యే మంత్రి ఆర్కే రోజా( Rk roja )కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కే ఛాన్స్ అనుమానంగానే ఉన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.సామాజిక వర్గాల సమీకరణాలతోపాటు, సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు పై నియోజకవర్గ ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు సర్వేల ద్వారా తెలుసుకుంటున్న జగన్ దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టారు.
ఇప్పటికే నాలుగు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.ఐదో విడత జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం చేపట్టిన ఈ ప్రక్షాళనలో జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు సైతం టికెట్ ను దక్కించుకోలేకపోయారు.ఇక ఐదో జాబితాలో రోజా కూడా ఉండబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
దీనికి కారణం నియోజకవర్గం లో రోజాకు వ్యతిరేకంగా సొంత పార్టీ నాయకులే అసమ్మతిని వ్యక్తం చేయడం, రోజాకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వద్దంటూ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ ఉండడం వంటివన్నీ ఆమెకు ఇబ్బందికరంగా మారాయి.
దీంతో పాటు రోజాకు వ్యతిరేకంగా జడ్పిటిసిలు, ఎంపీటీసీలు గళం విప్పడం వంటివన్నీ వైసీపీ అధిష్టానం పరిశీలిస్తుంది.దీంతోపాటు రోజా సోదరుడు కుమారుడు కుమారస్వామి తమ వద్ద పదవి ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకున్నారంటూ కొంతమంది బహిరంగంగా విమర్శలు చేయడం వంటివన్నీ ఆమెకు ఇబ్బందికరంగా మారాయి.నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కేడర్ వ్యతిరేకిస్తూ ఉండడం తో పాటు వైసిపి సీనియర్ నేత, ప్రస్తుత మంత్రి రోజా విషయంలో మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉండడం, ఆమెకు సీటు ఇవ్వద్దని జగన్ వద్ద పట్టుపడుతుండడం వంటివన్నీ లెక్కలు వేసుకుంటే ఐదో విడత జాబితాలో రోజా పేరు కనిపించే అవకాశం ఉండకపోవచ్చు.
రోజాకు నగరి నియోజకవర్గంలో టికెట్ ఇవ్వకపోయినా, మరో నియోజకవర్గంలో జగన్( YS jagan ) సర్దుబాటు చేసే అవకాశం ఉండొచ్చని రోజా సన్నిహితులు ఆశలు పెట్టుకున్నారు.ఏది ఏమైనా రోజా విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.