Miss World Krystyna Fieszkova : మనిషి మాత్రమే కాదు.. మనసు కూడా అందమే.. మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఈ విషయాలు తెలుసా? 

71వ మిస్ వరల్డ్ పోటీల్లో చెక్ రిపబ్లిక్ యువతి క్రిస్టినా ( krystyna ) విశ్వ సుందరి కిరీటం దక్కించుకుంది.కిరీటం అందుకున్న తరువాత క్రిస్టినా భావోద్వేగానికి గురైంది.

 Intresting Facts About Miss World Krystyna Pyszkova-TeluguStop.com

ఆమె అందానికి ఫిదా అవ్వటమే కాదు ఆమె గురించిన వివరాలు తెలిస్తే ఆమె సేవా తత్పరత కు కూడా ఫిదా అవ్వాల్సిందే.క్రిస్టినా పిస్కో ఫౌండేషన్ ( Pisco Foundation )స్థాపించారు.

దాని ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్నారు.ఆర్థికంగా వెనుకబడిన చిన్నారులకు విద్య దూరం కాకూడదని భావించిన క్రిస్టినా టాంజానియాలో ఒక పాఠశాలని ప్రారంభించింది.

-Latest News - Telugu

అక్కడ పిల్లలకు నాణ్యమైన విద్యను బోధిస్తోంది.నా జీవితంలో గర్వించదగ్గ విషయం ఏదైనా ఉందంటే అది స్కూల్ ని ప్రారంభించడమే అని చెప్పటం ఆమె మంచి మనసుకి తార్కాణం.ఈమె స్వచ్ఛంద సేవకురాలు గా కూడా పనిచేస్తోంది.2022లో లండన్ లోని ఎలైట్ మోడల్ మేనేజ్మెంట్ లో చేరి మెలకువలు నేర్చుకున్న క్రిస్టినా అదే ఏడాది లో నిర్వహించిన మిస్ చెక్ రిపబ్లిక్ పోటీలో పాల్గొని తొలి ప్రయత్నం లోనే విజయం సాధించారు.

-Latest News - Telugu

లా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్( Law, Business Administration ) పూర్తి చేసిన క్రిస్టినా మోడలింగ్ పై ఆసక్తి ఉండటంతో అటు వైపుగా అడుగులు వేశారు.విద్య ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు, ఎడ్యుకేషన్ కి దూరంగా ఉంటున్న బాలల గురించి మాట్లాడటానికే నేను ఇంతవరకు వచ్చాను.నేను ఈ అందాల పోటీలో గెలిచినా, గెలవకపోయినా ఆ చిన్నారుల ఉన్నతికి శ్రమిస్తూనే ఉంటాను అని పేర్కొన్నారు.ఆ మాటలకి ప్రాంగణం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది.కిరీటం అందుకున్న తర్వాత క్రిస్టినా గ్లోబల్ ప్లాట్ ఫామ్ పై చెక్ రిపబ్లిక్ కి ప్రాతినిధ్యం వహించడం తనకు దక్కిన గౌరవం అన్నారు.24 సంవత్సరాల ఈ యువతి ఇంగ్లీష్, జర్మన్, పోలిష్, స్లోవక్ లో అనర్గళంగా మాట్లాడగలరు.మ్యూజిక్, ఆర్ట్స్ పై ప్యాషన్ తో పాటు ఫ్లూట్ ప్లే చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది క్రిస్టినా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube