ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు ఎవరిదో తెలుసా?

ప్రపంచంలో ఖరీదైనవి చాలా ఉంటాయి.ఖరీదైన వస్తువులను వాడేందుకు చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు.

 Interesting Facts About World Costliest Home Palace Of Versailles Details, World-TeluguStop.com

ధనవంతులు అత్యంత విలువైన వస్తులను వాడుతూ ఉంటారు.అత్యంత లగ్జరీగా జీవిస్తూ ఉంటారు.

వారు ఎక్కడికెళ్లినా, ఏది వాడినా లగ్జరీగా కనిపించేందుకు ఇష్టపడతారు.అయితే ప్రపంచంలో అత్యంత విలువైనవి చాలా ఉన్నాయి.

ప్రతిదానిలోనూ అత్యంత విలువైన వస్తువులు ఉన్నాయి.అత్యంత ఖరీదైన ప్రదేశాలు, వస్తువులు ఉన్నాయి.

అయితే ప్రపంచంలోనే అత్యంత విలువైన ఇల్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఫ్రెంచ్ రాజ కుటుంబం అదికారిక నివాసం వెర్సెల్లెస్ ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యంత విలువైన భవనంగా ఉంది.

ఇప్పుడు దీనిని మ్యూజియంగా మార్చారు.చాటేయి లూయిస్ భవనం యజమాని గురించి అిధికారికంగా ఎలాంటి సమాచారం ప్రస్తుతం రికార్డుల్లో లేదు.అలాగే ఇందులో ఒక రాత్రి బస చేయడానికి ఎంత ఖర్చు అవుతుందనే విషయం కూడా రికార్డుల్లో అందుబాటులో లేదు.

7 వేల చదరపు మీటర్లలో ఈ ప్యాలెస్ విస్తరించి ఉంది.2015లో 275 మిలియన్ యూరోలకు ఈ భవనాన్ని కొనుగోలుదారు కొనుగోలు చేశారు.దీంతో ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన ఫార్చ్యూన్ మ్యాగజైన్ దీనిని ప్రపంచంలోనే అత్యంత విలువైన, ఖరీదైన ఇల్లుగా గుర్తించింది.

Telugu France, Mohammadbin, Saudi, Latest, Costliest-General-Telugu

అలాగే 2017లో ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ భవనం సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ కు చెందినదిగా గుర్తించినట్లు తెలిసింది.నకిలీ కంపెనీల ద్వారా ఈ భవనాన్ని అక్రమంగా కొనుగోలు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని ఫ్రాన్స్, సౌదీ అరేబియా తెలిపింది.ఆ కథనాన్ని తీవ్రంగా ఖండించింది.

చాటేయి లాయిస్ భవనాన్ని జమాల్ ఖషోగ్గి బంధువు ఇమాద్ ఖసోగ్గి లాయిస్ నిర్మించాడు.ఫ్రాన్స్ లో అత్యంత లగ్జరీ ప్రాపర్టీ డెవలప్ మెంట్ బిజినెస్ ను ఇతడు నడుపుతున్నాడు.

ఇందులో నైట్ క్లబ్ తో పాటు సినిమాహాల్, గోల్డ్ లీఫ్ ఫౌంటెన్ ఉన్నాయి.ఈ భవనంలో నీటి అడుగున ఒక గది ఉంది.

లోపలికి వెళితే ఆ గది అక్వేరియంలా కనిపిస్తూ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube