ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల బరిలో భారత సంతతి మహిళా డాక్టర్

వృత్తి, ఉద్యోగ , వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడ కీలక స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.అమెరికా నుంచి అమలాపురం వరకు భారతీయుల ప్రాబల్యం లేని దేశం లేదంటే అతిశయోక్తి కాదు.

 Indian Woman Doctor To Contest In Australia Elections Details, Indian Woman Doct-TeluguStop.com

భారతీయులు పెద్ద సంఖ్యలో స్ధిరపడిన దేశాల్లో ఆస్ట్రేలియా కూడా ఒకటి.ఇక్కడ వ్యాపారవేత్తలుగా, డాక్టర్లుగా, శాస్త్రవేత్తలుగా, కార్పోరేట్ దిగ్గజాలుగా భారతీయులు రాణిస్తున్నారు.

రాజకీయాల్లోనూ మనవాళ్లు దూసుకెళ్తున్నారు.మేయర్లుగా, కౌన్సిలర్లుగా, మంత్రులుగా, చట్టసభ సభ్యులుగా కీలక స్థానాల్లో వెలుగొందుతున్నారు.

తాజాగా ఆస్ట్రేలియాలో( Australia ) లిబరల్ పార్టీ( Liberal Party ) టిక్కెట్‌పై ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి భారత సంతతి మహిళా డాక్టర్ రత్తన్ దీప్ కౌర్ విర్క్( Dr Rattandeep Kaur Virk ) రాబోయే ఫెడరల్ ఎన్నికల్లో గ్రీన్ వే నుంచి అభ్యర్ధిత్వం ఖరారు చేసుకున్నారు.పంజాబ్‌లోని బర్నాలాలో పుట్టి పెరిగిన విర్క్.ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ డిగ్రీని అందుకుని భారత్‌లో కొన్నాళ్లు రెసిడెంట్ డాక్టర్‌గా సేవలందించారు.18 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వలస వచ్చారు డాక్టర్ రత్తన్ దీప్.ఇక్కడికి వచ్చాక ఆస్ట్రేలియన్ కమ్యూనిటీ విభిన్న అవసరాలకు అనుగుణంగా ఆక్యుపేషనల్ థెరపీలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించారు.

Telugu Australia, Drrattandeep, Greenway, Indiaaustralia, Indian, Liberal-Telugu

ఆస్ట్రేలియా – భారత్ మధ్య బలమైన సంబంధాలను పెంపొందించడానికి ఆమె కృషి చేశారు.ఇండియా – ఆస్ట్రేలియా స్ట్రాటజిక్ అలయన్స్( India – Australia Strategic Alliance ) సహ వ్యవస్ధాపకురాలిగా, కో చైర్‌గా తన భర్త డాక్టర్ జగ్విందర్ సింగ్ విర్క్‌తో కలిసి ఆర్ధిక, వాణిజ్య, బలమైన సాంస్కృతిక ప్రచారంలో కీలకపాత్ర పోషించారు.కమ్యూనిటీకి అవసరమైన సేవలు, మౌలిక సదుపాయాలను అందిస్తానని ఎన్నికల ప్రచారంలో విర్క్ వాగ్ధానం చేశారు.

తాను గతంలో ఐదేళ్ల పాటు ఎన్ఎస్‌డబ్ల్యూ రూరల్ ఫైర్ సర్వీస్ వాలంటీర్‌గా చేశానని, అత్యవసర సమయాల్లో మా కమ్యూనిటీకి మద్ధతునిచ్చానని డాక్టర్ రత్తన్ దీప్ చెప్పారు.

Telugu Australia, Drrattandeep, Greenway, Indiaaustralia, Indian, Liberal-Telugu

పెద్ద సంఖ్యలో భారతీయ ప్రవాసులు గ్రీన్ వే ప్రాంతంలో( Greenway ) నివసిస్తున్నారని .ఎన్నికల్లో వారి మద్ధతును పొందానని ఆమె తెలిపారు.ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన మొదటి దృష్టి జీవన వ్యయం, సరసమైన గృహాలను అందించడంపైనే ఉంటుందని రత్తన్ దీప్ చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube