భారత్ ప్రధానిగా మోదీ( Prime Minister Modi ) బాధ్యతలు చేపట్టాక అంతర్జాతీయ స్థాయిలో దేశం ఎంతో శక్తివంతంగా అవతరించింది.ఒకప్పుడు భారత్( Bharat ) అంటే చిన్న దేశాలతో పోల్చే పరిస్థితి ఉండేది.
మోదీ ప్రధాని అయిన తర్వాత పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి.ప్రపంచంలో భారత్ శక్తివంతమైన దేశంగా కీర్తించబడుతుంది.
కరోనా లాంటి కష్ట కాలంలో అనేక దేశాల ఖజానాలు తలకిందులయ్యాయి.కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ( Indian Economy ) మాత్రం చాలా పటిష్టంగా తట్టుకుని నిలబడింది.
దీనికి ప్రధాన కారణం మోదీ నాయకత్వం( Modi Leadership ) అని చెప్పవచ్చు.మరికొద్ది సంవత్సరాల లోనే ప్రపంచంలో మూడో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నట్లు ప్రపంచ దేశాలు తెలియజేస్తున్నాయి.
మోదీ ప్రధాని అయ్యాక భారతదేశంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి.దేశ సరిహద్దుల విషయంలో ఇంకా అనేక విషయాలలో భారత్ నీ టచ్ చేయాలంటే పొరుగు దేశాలు భయపడే పరిస్థితి ఏర్పడింది.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతగా ప్రధాని మోదీ( Most Popular Global Leader PM Modi ) మొదటి స్థానంలో నిలిచారు.ఇండియాలో ఆయన నాయకత్వాన్ని 78% ప్రజలు సమర్ధించినట్లు యూఎస్ కి చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ వెల్లడించింది.
ఆ తర్వాత మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్. 68%తో రెండో స్థానంలో నిలిచారు.అర్జెంటీనా ప్రెసిడెంట్ జావీర్ మిలే 63%, పోలాండ్ ప్రధాని డొనాల్డ్ 52%, స్విట్జర్లాండ్ ప్రధాని వియోలా అమ్హ ర్డ్ 51%తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.