కరోనా రోగులకు సంరక్షణ: భారత సంతతి నర్స్‌‌కు సింగపూర్ ప్రెసిడెంట్ అవార్డ్

కరోనా వైరస్‌ నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.కోవిడ్ సోకి ఇప్పటికే పలువురు మరణించగా.

 Indian Origin Nurse In Singapore Conferred With Presidents Award, Indian, Nurse,-TeluguStop.com

మరికొందరు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.వీరిలో భారతీయులు సైతం ఉన్నారు.

వీరు చేస్తున్న సేవలకు గాను ప్రపంచం సెల్యూట్ చేస్తోంది.తాజాగా కరోనా వారియర్స్‌ను సింగపూర్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారంతో గౌరవించింది.

దేశంలోని ఐదుగురు నర్సులను ప్రెసిడెంట్ అవార్డుతో సత్కరించింది.

వీరిలో భారత సంతతికి చెందిన 59 ఏళ్ల కళా నారాయణ స్వామి కూడా ఉన్నారు.ఈమె ఉడ్‌ల్యాండ్స్ హెల్త్ క్యాంపస్‌లో నర్సింగ్ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.2003లో సార్స్ వ్యాప్తి చెందుతున్న సమయంలో నేర్చుకున్న ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీస్‌ను ప్రస్తుత పరిస్థితుల్లో ఉపయోగించి సేవలందించారు.రోగుల సంరక్షణ, విద్య, పరిశోధన, పరిపాలనలో అత్యుత్తమ పని తీరును కనబరిచిన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తుంటారు.2000 సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఈ అవార్డును ఇప్పటి వరకు 77 మంది నర్సులు అందుకున్నారు.

Telugu Coronavirus, Indian, Indianorigin, Kala Yana Swamy, Nurse, Award, Singapo

అవార్డు కింద ట్రోఫీతో పాటు అధ్యక్షుడు హలిమా యాకోబ్ సంతకంతో కూడిన ధ్రువీకరణ పత్రం, 7,228 యూఎస్ డాలర్లను అందజేస్తారు.తనను ప్రెసిడెంట్ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల కళా నారాయణ స్వామి హర్షం వ్యక్తం చేశారు.తర్వాతి తరం నర్సులను తయారు చేయడంపైనే ఎక్కువ ఆసక్తితో ఉన్నట్లు ఆమె తెలిపారు.మీరు చేసే పని ఏదైనా సరే.ఎప్పుడూ శ్రద్ధ పెట్టి చేయండి.ఇలాంటి అవార్డులు, ప్రశంసాపత్రాలపై మీ పేరు రాసిపెట్టి ఉంటుందని కళా చెప్పారు.

నర్సింగ్ వృత్తిలో తగిన ప్రతిఫలం తప్పకుండా చేకూరుతుందని తానెప్పుడూ అందరితో చెప్పేదాన్నని.తన విషయంలో అది నిజమైందని ఆమె అన్నారు. 2022లో ప్రారంభించాలని చూస్తున్న ఉడ్‌ల్యాండ్స్ హెల్త్ క్యాంపస్ ప్లానింగ్‌పైనే కళా దృష్టి సారించారు.తన 40 ఏళ్ల నర్సింగ్ అనుభవాన్ని రంగరించి నైపుణ్యం వున్న నర్సులను సమాజానికి అందించే ప్రయత్నాలు చేస్తానని ఆమె చెప్పారు.మరోవైపు సింగపూర్‌లో ఇప్పటి వరకు 48,744 కరోనా కేసులు నమోదవ్వగా.27 మంది మరణించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube