భారతీయ సంతతికి చెందిన వైద్యురాలు ప్రొఫెసర్ మేఘనా పండిట్ యూకేలోని అతిపెద్ద బోధనాసుపత్రుల్లో ఒకటైన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్ ఎన్‌హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా నియమితులయ్యారు.అంతేకాదు.
ఈ ట్రస్ట్ చీఫ్‌గా నియమితులైన తొలి మహిళగా మేఘనా పండిట్ రికార్డుల్లోకెక్కారు.అంతేకాదు.
యూకేలోని అతిపెద్ద బోధనా ఆసుపత్రులకు ప్రాతినిథ్యం వహిస్తున్న షెల్‌ఫోర్డ్ గ్రూప్‌కు సీఈవోగా నియమితులైన భారత సంతతికి చెందిన వ్యక్తిగానూ ఆమె చరిత్ర సృష్టించారు.
ఆక్స్‌ఫర్డ్ డీనరీలో ప్రసూతి శాస్త్రం, గైనకాలజీలో మేఘనా పండిట్ శిక్షణ పొందారు.
అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయంలో యూరోగైనకాలజీలో విజిటింగ్ లెక్చరర్‌గా వున్నారు.ఆమె ఎన్‌హెచ్ఎస్ ట్రస్ట్‌లలో గతంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంగా)గానూ పనిచేశారు.
గతంలో వందలాది మంది వైద్యులను పర్యవేక్షించే క్లినికల్ స్ట్రాటజీకి నేతృత్వం వహించారు.వార్విక్ విశ్వవిద్యాలయంలో గౌరవ ప్రొఫెసర్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని గ్రీన్ టెంపుల్టన్ కళాశాలలో అసోసియేట్ ఫెలోగానూ మేఘన వ్యవహరించారు.
ఓయూహెచ్ ప్రకారం.ఇంటర్వ్యూ ప్యానెల్‌లోని సభ్యులందరూ ఆమె నియామకానికి ఏకాభిప్రాయానికి వచ్చారు.ఈ వారం ప్రారంభంలో జరిగిన కౌన్సిల్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో మేఘనా పండిట్ నియామకానికి చెందిన సిఫార్సును ఆమోదించారు.ఇంటర్వ్యూ ప్యానెల్‌లో ట్రస్ట్ చైర్, ప్రొఫెసర్ సర్ జోనాథన్ మోంట్‌గోమెరీ, మరో ఇద్దరు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లు, లీడ్ గవర్నర్, బకింగ్‌హామ్‌షైర్, ఆక్స్‌ఫర్డ్ షైర్, బెర్క్‌షైర్ వెస్ట్‌లకు చెందిన చైర్‌లు వున్నారు.
కాగా.ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్ ఎన్‌హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ కింద నాలుగు ప్రధాన ఆసుపత్రులు ప్రజలకు సేవలందిస్తున్నాయి.అవి జాన్ రాడ్‌క్లిఫ్ హాస్పిటల్స్, చర్చిల్ హాస్పిటల్స్, నఫీల్డ్ ఆర్థోపెడిక్ సెంటర్, హోర్టన్ జనరల్ హాస్పిటల్.కాగా.2018లో బ్రెగ్జిట్ ప్రభావంతో పాటు ఆ ప్రాంతంలో అధిక జీవన వ్యయం కారణంగా ట్రస్ట్‌లో 450 నర్సింగ్ ఖాళీలు వున్నాయని మేనేజ్‌మెంట్ చెప్పింది.దీని కారణంగా బెడ్‌లను మూసివేయాల్సి వచ్చిందని వారు నివేదించారు.