ప్రస్తుత వేసవి కాలంలో( summer ) వేడి గాలి, ఎండల ప్రభావం కారణంగా చాలా మంది జుట్టు విపరీతంగా డ్రై అయిపోతూ ఉంటుంది.అలాగే కొందరి జుట్టు చెమట పట్టి చెడు వాసన( bad smell ) వస్తుంటుంది.
అయితే ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టే సూపర్ హోమ్ రెమెడీ ఒకటి ఉంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఓ లుక్కేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో నానబెట్టుకున్న మెంతులు మరియు వాటర్ వేసుకుని 15 నిమిషాల పాటు మరిగించాలి.
ఇలా మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు వైట్ రైస్ ( White rice ) ను వేసుకోవాలి.
అలాగే ఒక అరటిపండును( Banana ) స్లైసెస్ మాదిరి కట్ చేసుకుని వేసుకోవాలి.ఆపై రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ ( Coffee powder )మరియు మెంతుల వాటర్ ను పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

ప్రస్తుతం వేసవి కాలంలో వారానికి ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల చాలా లాభాలే ఉన్నాయి.ఈ ప్యాక్ డ్రై అయిన జుట్టును రిపేర్ చేస్తుంది.కురులకు చక్కని పోషణ అందిస్తుంది.డ్రై నెస్ తగ్గించి జుట్టును తేమగా మృదువుగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.అలాగే వైట్ రైస్, అరటిపండు, కాఫీ పౌడర్ మరియు మెంతుల నీరు జుట్టు నుంచి చెడు వాసన రాకుండా అడ్డుకట్ట వేస్తాయి.

చుండ్రుతో సహ తలలో ఇతర ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉంటే వాటిని నివారిస్తాయి.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.
కాబట్టి ఈ వేసవిలో ఆరోగ్యమైన మృదువైన మెరిసే కురులను కోరుకునేవారు తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.