ఇండియా పేరుతో భారత్‌గా మారిస్తే.. ఆ వెబ్‌సైట్లు ఇక బంద్

ఇండియా( India ) పేరును భారత్‌గా( Bharat ) మార్చాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే.ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

 If India To Be Renamed Bharat Dot In Websites May Have A Tld Identity Crisis Det-TeluguStop.com

లోక్ సభ ఎన్నికలకు మరో ఆరు నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిల్చడానికి పేరు మారుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే దేశంలోని ఎన్డీయే వ్యతిరేక పార్టీలన్నీ ఇండియా పేరుతో( INDIA Alliance ) ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి.

Telugu Domain, Behrain, Bharat, Change, India, India Alliance, India Change, Lat

ఈ క్రమంలో ప్రతిపక్షాల కూటమిని నీరు గార్చేందుకే భారత్‌గా పేరును మారుస్తున్నారనే చర్చ జరుగుతోంది.అయితే ఇండియా పేరును భారత్ గా మారిస్తే చాలా వెబ్ సైట్ల పేర్లు( Websites ) కూడా మార్చాల్సి ఉంటుంది..in డొమైన్ గల వెబ్ సైట్లను ఏం చేస్తారనే చర్చ జరుగుతోంది.

ఏదైనా దేశం పేరు మారితే టాప్ లెవల్ డొమైన్ అని పిలిచే దాని టీఎల్‌డీ ప్రభావితం చేయవచ్చు.టీఎల్‌డీ అనేది దేశంలోని వెబ్ పైట్ల చివర ఉన్న ఒకటి లేదా రెండు ఆక్షరాల డొమైన్.ప్రస్తుతం అన్ని ప్రభుత్వ సంస్థల వెబ్ సైట్లు .inతో డొమైన్ పేర్లు ఉన్నాయి.

Telugu Domain, Behrain, Bharat, Change, India, India Alliance, India Change, Lat

ఒకవేళ ఇండియా పేరును మార్చి భారత్ గా పరిగణిస్తే .BHగా భర్తీ చేయవచ్చని అంటున్నారు.యూఎస్‌లో .us, బ్రిటన్ లో .uk, జర్మనీలో .de అని వెబ్ సైట్ల చివర డొమైన్ పేర్లు ఉంటాయి.ఒకవేళ ఆ దేశాల కూడా పేర్లు మార్చుకుంటే ఉన్నతస్థాయి డొమైన్లు( Domain Names ) ప్రభావితం అవుతాయి.

అయితే bh అనే పేరును ఇప్పటికే బహ్రెయిన్ దేశం అధికారిక వెబ్ సైట్ లో నమోదు చేయబడంది.పేరు మార్చాక కూడా పాత్ డొమైన్ ను వాడొచ్చు.

దీంతో ప్రపంచంలోని డొమైన్ పేర్రలు, ఐపీ అడ్రస్ లను ఎవరు నిర్వహిస్తారనే దానిపై సందిగ్ధత నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube