చిట్యాల కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

నల్గొండ జిల్లా:చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామం శివారులో సిరీస్ కెమికల్ కంపెనీలో రియాక్టర్ పేలి నలుగురు సజీవ దహనం అయ్యారన్న వార్త ఆ ప్రాంత ప్రజలను ఉలిక్కిపాటుకు గురిచేసింది.

బుధవారం సాయంత్రం హిందూస్ కంపెనీలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.

ఈ ధాటికి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనం కాగా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Huge Explosion In Chityala Chemical Factory-చిట్యాల కెమి�

పలువురికి తీవ్ర గాయాలవడంతో వారిని హుటాహుటిన నార్కెట్ పల్లి కామినేని హాస్పిటల్ కి తరలించారు.అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే పేలుడు ఘటనలో మృతి చెందిన మృతదేహాల జాడ కూడా తెలియకుండా యాజమాన్యం జాగ్రత పడుతున్నట్లు తెలుస్తోంది.పేలుడు సంభవించిన ఫ్యాక్టరీ చుట్టుపక్కల నివాస ప్రాంతాలు కావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతతూ కంపెనీ దగ్గరకు చేరుకుని ఘటనకు సంబంధించి వివరాలు ఎందుకు దాస్తున్నారని ఘటనా స్థలంలోని పోలీసులను, అధికారులను నిలదీశారు.

Advertisement

అందులో పని చేసే వర్కర్స్ వలస కూలీలు కావడం,వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు,బంధువులు ఇక్కడ లేకపోవడం గమనార్హం.దీనితో కంపెనీ యాజమాన్యం మీడియాకు వివరాలు తెలియకుండా గోప్యత పాటిస్తుండగా,దానికి అధికారులు,పోలీసులు సహకరీంచడంపై స్థానికుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రియాక్టర్ పేలిన సమయంలో ఎంతమంది షిప్ట్ లో ఉన్నారనే విషయం కూడా తెలియకుండా సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.ఎంతమంది మృత్యువాత పడ్డారు?ఎంతమంది ప్రాణాలతో ఉన్నారనే సమాచారం కూడా తెలియడం లేదంటే దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది.

కంపెనీ పరిసరాలు మొత్తం నల్లటి పొగలు కమ్ముకోవడంతో పరిస్థితి అంత్యత భయనంకంగా మారింది.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
Advertisement

Latest Nalgonda News