మీ వాట్సాప్ ప్రొఫైల్ ఎవరు చూస్తున్నారో కనిపెట్టడం ఎలా?

ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారంటే లైక్స్ పడుతూ ఉంటాయి.మన పోస్టు చూసినవారంతా లైక్ కొట్టారో లేదో కాని, లైక్ కొట్టినవారైన మన పోస్టు చూసినట్టు అర్థమవుతుంది.

 How To Know Who Is Checking Your Whatsapp Profile-TeluguStop.com

కొన్ని పోస్టులు మనం మనకి ఇష్టమన వారి కోసం పెడతాం.ఈ పోస్టుని వారు గమనించారో లేదో మనకు తెలియడం కష్టం.

ఇక వాట్సాప్ విషయానికి వస్తే మనం పెట్టె స్టేటస్ ఎవరు చూసారు అనేది డైరెక్ట్ గా తెలిసిపోతుంది కాని, మన ప్రొఫైల్ ని ఎవరు చూస్తున్నారు, మన ప్రొఫైల్ పిక్చర్ ని ఎవరు చూస్తున్నారు, మనకు ఇష్టమైన వ్యక్తీ చూస్తున్నారో లేదో తెలుసుకోవడమే కష్టం.అందుకోసమే ఒక ట్రిక్ అందుబాటులో ఉంది.

దాన్ని ట్రిక్ అనేకంటే ఒక థర్డ్ పార్టి యాప్ అనాలి.ఆ యాప్ పేరే Whats Tracker.

దీన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూడండి

* ప్లే స్టోర్ నుంచి యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న తరువాత అది కొన్నిరకాల కండీషన్స్ పెట్టి మీ సమ్మతిని అడుగుతుంది.Agree & Continue నొక్కేయండి

* ఆ తరువాత ఒక పాప్ అప్ విండో వచ్చి లొకేషన్ ఆక్సెస్ అడుగుతుంది.

పర్మిట్ చేయండి

* మీ పేరు మరియు నంబర్ వివరాలు ఇచ్చి గ్రీన్ బటన్ మీద క్లిక్ చేయండి

* అ యాప్ కొన్ని పర్మీషన్స్ అడుగుతుంది.అంటే మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ వివరాలు తీసుకుంటుంది.

పర్మిట్ చేయండి.అంతే, మీ ప్రొఫైల్ చెక్ చేస్తున్నవారి డేటా మొత్తం మీ ముందు ఉంటుంది

నోట్ : ఇది ఒక థర్డ్ పార్టీ యాప్.దీనికి వాట్సాప్ తో ఎలాంటి సంబంధాలు లేవు.మీరు పర్మీషన్స్ ఇస్తున్నారు అంటే మీ వివరాలను ఆ యాప్ సృష్టికర్తల చేతిలో పెడుతున్నట్లు.కాబట్టి ఒకటికి మూడుసార్లు అలోచించి వాడడం, వాడకపోవడం మీద నిర్ణయం తీసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube